జరజాపుపేట అభివృద్ధే ధ్యేయంగా
సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులతో
ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న
నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు
విజయనగరం జిల్లా,నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ని జరజాపుపేటను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు అన్నారు.
నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి లోని
జరజాపుపేటలో 18వ వార్డు కౌన్సిలర్ నల్లి కృష్ణవేణి & శ్రీను ఆధ్వర్యంలో విఎమ్ఆర్డిఏ నిధులు నుండి 10 లక్షలు రూపాయలు అభివృద్ధి పనులుకు గ్రామ పెద్దలు మరియు మహిళల సమక్షంలో కౌన్సిలర్ నల్లి కృష్ణవేణి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగిందని అన్నారు, సోమవారం నాడు మొదటి విడతగా సుమారు85 మీటర్లు పొడవునా,3 మీటర్లు వెడల్పున, 7 ఇంచీల ఎత్తున సిసి రోడ్డును శాంతి నగరం వీధిలో పళ్ళ రాము ఇంటి దగ్గర ఉన్న కాలువ నుండి పడాల ప్రకాష్ ఇంటిదగ్గర ఉన్న రాస్తా వరకు చేపడుతున్న సీసీ రోడ్డు పనులను వైస్ చైర్మన్ రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి, సి సి రహదారి పనులును, పరిశీలించి, తగు సూచనలు చేసి, నాణ్యత ప్రమాణాలను పాటించి, క్వాలిటీగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను, చేయిస్తున్న కౌన్సిలర్ ను, పర్యవేక్షిస్తున్న ఏ.ఈ.లను అభినందించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రామారావు మాట్లాడుతూ.....
స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నగర పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో, సంబంధిత అధికారులు సలహాతో, వైస్ చైర్ పర్సన్ గా నాయొక్క చొరవతో,
జరజాపుపేటలో గల 6 వార్డులలో అభివృద్ధి పనులు, ఆయా వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు, త్వరలోనే, మిగతా వార్డులలో, అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డుకు, కౌన్సిలర్ ఆమోదం మేరకు, అన్ని వార్డులకు సమానంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం మేరకు, నిధులను కేటాయించడం జరిగిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 39 అభివృద్ధి పనులులో ఇప్పటికే చేపట్టడం, వాటిలో 10 పనులు పూర్తి చెయ్యడం జరిగిందని,ఈ నెల 8వతేదీ న, 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధుల నుండి, 2004 జూన్ లో మంజూరైన విఎం ఆర్డీఏ నిధులు టెండర్స్ వెయ్యనివి,టెండర్స్ వేసినా పనులు చేపట్టినటువంటి వాటికి కలుపుకొని మొత్తం 55 అభివృద్ధి పనులకు గాను 1 కోటి 53 లక్షలు 64 వేల రూపాయలుకు టెండర్స్ పిలవడం జరిగిందని తెలియజేశారు. ఇవి నగర పంచాయతీకు కేటాయించబడిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదిక పై అర్బన్ లోకల్ బాడీస్ కు విడుదల చేసిన నిధులని, ముఖ్యంగా జరజాపుపేట అభివృద్ధి జరగాలని, కౌన్సిలర్స్ అందరూ కలిసి పనులు చేయడానికి కాంట్రాక్టర్స్ ముందుకు రాని పరిస్థితుల్లో, వారికి అన్ని రకాలగా సపోర్ట్ చేస్తూ, సహకారాన్ని అందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ప్రజల కోసం, గ్రామ కోసం, అభివృద్ధి జరగాలని, ఆహార్నిశలు శ్రమించే మంచి వారినీ, ప్రజలు కష్టాలలో పాలుపంచుకొని, శ్రమించే వారిని, జరజాపుపేటలో గల చైతన్యవంతులైన ప్రజలు మరియు యువత ఎల్లప్పుడు గౌరవించి, ఆదరిస్తారని తెలియజేశారు.
సిసి రోడ్డు అభివృద్ధి
పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ18,17,1 వార్డుల కౌన్సిలర్స్ అవనాపు సత్యనారాయణ, నల్లి కృష్ణవేణి, కింతాడ కళావతి, 18,19,16 వార్డుల కౌన్సిలర్ ప్రతినిధులు నల్లి శ్రీను, తుమ్ము నారాయణమూర్తి,పాండ్రంకి సత్యనారాయణ, రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ కాళ్ళ సత్యవతి, ఏఎంసీ డైరెక్టర్ మద్దిల ముత్యాలనాయుడు, NDAకూటమి పార్టీల 18వ వార్డు ఇన్చార్జీలు కాళ్ళ రాజశేఖర్, అవనాపు మురళీకృష్ణ, గ్రామ పెద్దలు నల్లి శేఖర్, తుమ్ము వెంకటరమణ, పోలుబోతూ నారాయణమూర్తి, మద్దిల వాసు, కనకల హైమావతి, పెనుమత్స అప్పలరాజు, మన్యపురి మోహన్ రావు, మద్దిల రాజారావు,బోని వెంకటరమణ, కనకల వెంకటి, సుంకర ముత్యాలయుడు, డొంక కృష్ణ, దోమ నాగర్జున, మద్దిల అప్పన్న, మాత మురళీకృష్ణ, కాంట్రాక్టర్ బుగత శ్రీను, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సముద్రపుసత్తిబాబు, అవనాపూ విజయ్ భాస్కర్, మద్దిల దుర్గారావు, సముద్రపు వెంకటరమణ, నల్లి శివ ప్రసాద్,అవనాపు ధర్మారావు,ఏ.ఈ.లు దినేష్,మజీద్,18 వ వార్డు పెద్దలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.