పారిశుధ్య కార్మికుల ను ప్రజాసేవకులుగా గుర్తించాలి రామా రావు
పారిశుధ్య కార్మికుల ను ప్రజాసేవకులుగా గుర్తించాలి రామా రావు
పారిశుద్ధ్య కార్మికులను ప్రజా సేవకులుగా ప్రతి ఒక్కరు గౌరవించాలి వైస్ చైర్మన్ సముద్రపు రామారావు
నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయములో ప్రజారోగ్య విభాగములో పనిచేస్తు న్న టువంటి 40 మంది పారిశుద్య కార్మికులకు మరియు డ్రైవర్లకు కమిషనర్ ఎస్.జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికుడికి సుమారు 4000/- రూపాయలు విలువైన సామాగ్రి కిట్టులను (2 జతలు బట్టలు, 3 తువ్వాలిలు 24 సబ్బులు,4 కేజీల నూనెలు డబ్బులు,వర్క్ చేసేటప్పుడు వేసుకొనే అప్రాన్లు ను,2 జతలు బూట్లు ను),నెల్లిమర్ల నగర పంచాయతీ జనరల్ ఫండ్ నుండి సుమారు 1 లక్ష యాభై వేలు రూపాయల నిధులతో చైర్ పర్సన్ శ్రీమతి బంగారు సరోజినీ, వైస్ చైర్ పర్సన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, పట్టణ పెద్దలు లెంక అప్పలనాయుడుల చేతులు మీదగా పంపిణీ చేయడం జరిగింది. వైస్ చైర్మన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ.... జై జవాన్, జై కిసాన్ అని సైనికులను, రైతులను ఎలాగైతే మనమందరం గౌరవించుతామో, అలాగే ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను కూడా అదే స్థాయిలో ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి తర్వాత ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, వారికి కావలసిన అవసరమైన పనిముట్లను అందించాలని, కమిషనర్ వారికి శానిటేషన్ ఇన్స్పెక్టర్ వారికి కౌన్సిల్ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ టి.జయరాం, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంచార్జి డి.ఉమా భాస్కర్, సానిటరీ సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read More
|