
రైల్వే ఛార్జీలు పెంపు- జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు....
Railway Ticket Charges :
భారత రైల్వే నాన్ ఏసీ, ఏసీ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. ఛార్జీలను పెంచుతూ, టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలను జోడిస్తూ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచే నూతన రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్‌లు అమలులోకి వస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది....
జూలై 1 నుంచి మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-AC ఛార్జీలను కిలోమీటరుకు ఒక పైసా చొప్పున అలాగే అన్ని AC క్లాస్‌లకు సంబంధించి కిలోమీటరుకు రెండు పైసాల చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి జూన్ 24న అధికారులు నూతన ఛార్జీలను ప్రతిపాదించారు. ఈ విషయంపై సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని సబర్బన్ రైళ్ల టికెట్ల ఛార్జీలలో ఎలాంటి మార్పు చేయలేదు....
నూతన రైల్వే ఛార్జీలు ఇలా ఉన్నాయి!
సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉండనున్నాయి. 501 నుంచి 1500 కిలో మీటర్ల వరకు టికెట్‌పై ఐదు రూపాయలు , 1500 నుంచి 2500 కిలోమీటర్ల వరకు 10 రుపాయలు, 2501 నుంచి 3 వేల కిలో మీటర్ల వరకు టికెట్‌పై 15 రూపాయలు చొప్పును పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జూలై 1 నుంచి సాధారణ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రైలు ప్రయాణానికి కిలోమీటరుకు అర పైస ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీల్లో మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు నూతన ఛార్జీలు అమలుకావని తెలిపింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసిన రైల్వేశాఖ జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలంటూ అన్ని జోన్ల మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో అర్ధరాత్రి 12గంటల నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలులోకి రానున్నాయి.....
ఇకపై ఆధార్ అథంటికేషన్తోనే తత్కాల్ టికెట్స్ బుకింగ్- రైల్వే శాఖ నిర్ణయం....