logo
(Trust Registration No. 393)
AIMA MEDIA
logo

పాణ్యం (ప్రజా పాలన ): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మాణము గావించబడుతున్న వసతి గృహము నిర్మాణము నిమిత్తము భక్తులు 1 లక్ష 1116/ లు సోమవారం విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం. రామకృష్ణ తెలిపారు. కర్నూలు పట్టణంలో చెందిన పంచాగ్నుల మల్లికార్జున శాస్త్రి జ్ఞాపకార్థం కుమారుడు పి.రమేష్ భరద్వాజ్ అనే భక్తుడు వారికి స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా రూ.1,01,116/ లు ఒక లక్ష ఓక వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా సమర్పించారని, వారికి ఆలయ మర్యాదలతో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి శేష వస్త్రములతో సత్కరించి, స్వామివారి ప్రతిమ, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0
0 views    0 comment
0 Shares

నంద్యాల (AIMA MEDIA): రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల పట్టణంలో సిటీ బస్టాండ్ సంజీవనగర్ గేట్ మొదలగు ప్రదేశాలలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మోటార్ వాహనాల చట్టం (M.V Act) యొక్క నియమాలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కలిగి ఉండడంతో పాటు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు.ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని మరియు రోడ్డు ప్రమాదాలను నివారించుటకు డ్రైవర్ ప్రక్కన ప్రయాణికులను కూర్చో పెట్టుకొని ప్రజలను రవాణా చేయరాదని మరియు వాహన పరిమితికి మించి ప్రయాణికులను అధిక బరువుతో ఆటోలను నడపరాదన్నారు.నంద్యాల పట్టణంలో పట్టణంలో క్రమశిక్షణగల ట్రాఫిక్ వాతావరణాన్ని పెంపొందించడం కొరకు ఆటోలను ఆటో స్టాండ్ లలో మాత్రమే పార్కింగ్ చేయాలని, ఓవర్ స్పీడ్ తో ఆటోలు నడిపి ప్రమాదంలో పడరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరిస్తున్నారు.

0
5 views    0 comment
0 Shares