సమగ్ర కుటుంబ సర్వే పై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లాలోని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, డి ఆర్ డి ఓ విద్యాచందన, జడ్పీ సీఈవో చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, సిపిఓ సంజీవరావు, డీఎల్పీవోలు,ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు,తాసిల్దారులు,ఎంపీడీవోలు,ఎంపీ ఓలు మరియు ఎంఈఓ లు తో జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అమలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి వివరాలను సేకరించి, స్టిక్కర్లను అందించడం రేపటి వరకు పూర్తవుతుందని, సర్వే 9వ తేదీ నుండి ప్రారంభమవుతుందని అన్నారు.ఇంకా ఎక్కడైనాకుటుంబ గుర్తింపు మిగిలి ఉన్న త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్తించిన కుటుంబ వివరాలను ఆన్లైన్ లో తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచాలన్నారు.సర్వే వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి అనుభవజ్ఞులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని సూచించారు. దీని ద్వారా సర్వే సంబంధిత వివరాలు సక్రమంగా నమోదు చేయబడతాయి అన్నారు. ప్రజలను ఈ సర్వేలో పాల్గొనడానికి ప్రోత్సహించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని, ప్రజలను ప్రతి రోజూ ఛైతన్యపర్చాలని అన్నారు.ఈ సర్వేలో ప్రతి ఒక్క కుటుంబం పాల్గొనాలని, ఎ ఒక్క ఇంటిని వదలకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే సమయంలో ఎటువంటి సమస్య తలెత్తిన వెంటనే పై అధికారులకు ఎన్యుమరేటర్లు తెలియజేయాలన్నారు.