logo

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ట్ ఎదుట రెండో ఏఎన్ఎమ్ల ఎదుట ధర్నా

ప్రతి నెల 5గురు గర్భిణీ నమోదు లేకుంటే మెమో ఇస్తూ అధికారుల వేధింపులు పై ఆవేదన తో ఆందోళన.
జిల్లా స్థాయి మెడికల్ అధికారులు నిర్లక్ష్యం తో జిల్లాలో 2 ఏళ్లుగా అందని ఏవిడి బిల్స్
శ్రమ దోపిడీ కి గురి అవుతున్న 2ANMs.
ధర్నా లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్.
ధర్నా వద్దకు వచ్చి సమస్యలు పై చర్చిస్తున్న DM &HO భాస్కర్ నాయక్.
సమస్యలపై జిల్లా కలెక్టర్ పాటిల్ కు వినతిపత్రం అందచేత.

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గల అన్ని మండలం ల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు పద్ధతి లో పని చేస్తున్న ఏఎన్ యం లు కు తక్కువ వేతనాలు తో వెట్టి చాకిరీ చేపిస్తున్నారు అని ప్రతి నెల NHM స్కిం లో పని చేస్తున్న 2 ANM ల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ మన జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం గ్రామాల్లోకి వెళ్ళాలి అంటే దూరం గా ఊరు లు ఉంటాయి రోడ్డు సౌకర్యం మా ANMs రవాణా కు చాలా ఇబ్బందులు వస్తున్నవి. మాకు టిఏ లు ఇవ్వటం లేదు, దానికి తోడు అదనపు పనులు op డ్యూటీ లు. ఇంకా ఆన్ లైన్ ఆఫ్ లైన్ పనులు ఇస్తున్నారు ప్రభుత్వ ANM లు మాత్రం మెడికల్ అధికారులు డ్యూటీ లో తక్కువ గా వేస్తూ కాంటాక్ట్ ఏఎన్ఎం లు కు డ్యూటీ లు వేస్తూ వేదిస్తున్నారు అని ఆరోపించారు. ఆన్ లైన్ వర్క్ సింగిల్ 2 ANMs ఉన్న వాళ్ళ పై పని భారం లేకుండా చెయ్యాలి అని, డాక్టర్స్,సూపర్ వైజర్స్ వేధింపులు అరికట్టాలి. Op డ్యూటీ రద్దు చెయ్యాలి. Avd అమౌంట్స్ 2 yers వి రాలేదు వాటిని తక్షణమే ఇవ్వాలి. యూనిఫామ్ అలవేన్స్ లు ఇవ్వాలి. టాబ్స్ వర్కింగ్ లో లేవు కొత్తవి ఇవ్వాలి. ANC టార్గెట్ లు రద్దు చెయ్యాలి. CL 35 పై క్లారిటీ గా లేకుండా అధికారులు ఇబ్బందులు నుండి చట్ట ప్రకారం ఉన్న CLs ఇవ్వాలి. 7 నెల ల పెండింగ్ ఫైఆర్సి తక్షణమే ఇవ్వాలి. 8 నెలల పెండింగ్ యాక్షనేషన్అమౌంట్ ఇవ్వాలి. ఆన్ లైన్ లేదా మాన్యూవల్ ఎదో ఒక్కటి రికార్డ్ చేసేలా నిర్ణయం తీసుకోని పని భారం తగ్గించాలి. రెండో ఏఎన్ఎమ్ లను తక్షణమే సర్వీస్ రెగ్యులర్ చెయ్యాలి. ట్రాన్సఫర్ లు జరిపేలా GO ఇవ్వాలి. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల కు ఇచ్చిన DA పెంపు ను రెండో ఏఎన్ఎమ్ లకు అమలు చెయ్యాలి. రవాణా బత్యం అందించాలి. నెట్ బిల్స్. స్టేషనరి బిల్స్. జీరాక్స్ బిల్స్ ఇవ్వాలి. పై డిమాండ్ లను మానవతా దృక్పధం తో కాంట్రాక్టు ఉద్యోగు లుగా తక్కువ వేతనాలు పొందుతన్న వారి పై అభిమానం తో పరిష్కరించాలని నరాటి కోరినారు. ఈ ధర్నా వద్ద కు జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ వచ్చి సమస్య లు పరిస్కారం కోసం కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పాటిల్ కు సమస్యలని విన్నపం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, ఎండీ యూసుఫ్, బానోత్ ప్రియాంక, పార్వతి. బాల నాగమ్మ, పద్మజ,ఇందిర. అరుణ, సుమలత, రాములమ్మ,జ్యోతి, పుష్ప, తదితరులు పాల్గొన్నారు.

5
1872 views