logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డ్రగ్స్ పై మెరుపు దాడి.

హైదరాబాద్:🚨రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️
మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను చూసి రాపిడో డ్రైవర్ శ్రీ సత్తు ఆదర్శ్ కు అనుమానం వచ్చింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సత్తు ఆదర్శ్ ఇచ్చిన పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక డ్రగ్ పెడ్లర్ ను, ఒక డ్రగ్ కన్జ్యూమర్ ను,రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పెడ్లర్ వద్ద నుండి 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సత్తు ఆదర్శ్ చూపిన సమయస్ఫూర్తి, సామాజిక బాధ్యతను అభినందిస్తూ... కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ శ్రీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ (IPS) గారు ఆదర్శ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు.

0
0 views

Comment