logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గౌరీశంకర్ వరుసగా రెండవ సారి వరించిన పదవి మూడు దశాబ్దాలుగా ఆర్యవైశ్య సంఘాల సేవలో ప్రొద్దుటూరి

తొర్రూరు: మే 29(AIMEDIA). తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రొద్దుటూరి గౌరీశంకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఉత్తర్వులు అందజేశారు. హైదరాబాదులోని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో శుక్రవారం గౌరీశంకర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. 30 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన గౌరీశంకర్ కు రెండవసారి రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులుగా నియామకం పొందే అవకాశం లభించింది. మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తొలి అధ్యక్షునిగా జిల్లాలో అన్ని మండలాల్లో కార్యవర్గాల నియామకంతో పాటు పెద్ద ఎత్తున మహాసభ సభ్యత్వాలను నమోదు చేయించారు. గతంలో జిల్లాలో 2500 ఉన్న మహాసభ సభ్యత్వాలను అదనంగా 3500 పెరిగేలా కృషిచేసి ప్రస్తుతం ఆరు వేల మహాసభ సభ్యత్వాలు కలిగిన జిల్లాగా నిలిపారు. అన్ని మండలాల ఆర్యవైశ్య సంఘాల బాధ్యులతో సమన్వయం చేస్తూ రాష్ట్ర మహాసభ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు జిల్లాలో తనదైన శైలిలో మహాసభ అభివృద్ధికి కృషి చేశారు. దీంతో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి వరించింది. తొర్రూరు కేంద్రంగా ఆర్యవైశ్య సంఘాల పటిష్టతకు పాటుపడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్యులందరికీ సుపరిచితులుగా గౌరీశంకర్ తనదైన ముద్ర వేసుకున్నారు. గౌరీశంకర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి తిరిగి రావడం పట్ల జిల్లాలోని ఆర్యవైశ్య సంఘాల బాధ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తల్లాడ వెంకట్రామారావు, ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్, కోశాధికారి సామ రామ్మూర్తి, పూర్వ భాద్యులు నాళ్ల నరసింహారావు, వజినపల్లి అనిల్ కుమార్, పువ్వాడ హరి ప్రసాద్, చీదర వీరన్న, వజినపల్లి దీప, తల్లాడ పావని, చీదర నీలిమ తోపాటు వివిధ మండలాల బాధ్యులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాల నిరంతర సేవల ఫలితంగా తనకు మరోసారి రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు పదవి రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర మహాసభ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా, ఆర్యవైశ్య కులస్తులకు అన్ని రకాల అండదండలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానని గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. మహాసభ రాష్ట్ర కార్యవర్గం నూతనంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల విజయవంతంలో సంపూర్ణ భాగస్వామిగా నిలుస్తానని, తనకు అండగా నిలిచిన అన్ని మండలాల, ప్రధానంగా తొర్రూరు ఆర్యవైశ్య సంఘాల బాధ్యులు, కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు.

0
35 views

Comment