రాష్ట్ర సెక్రెటరీ గా నియమితులైన కోతుల మల్లేష్.
Hyd:Press note : Date : 27.05.2026
*టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర సెక్రటరీ గా పోతుల మల్లేష్ నియామకం*
హైదరాబాద్ : టీపీసీసీ ఎస్సీ
డిపార్ట్మెంట్ రాష్ట్ర సెక్రటరీ గా హైదరాబాద్ నగరం, ఫిలిమ్ నగర్ కి చెందిన పోతుల మల్లేష్ మదాసి కురువ ని నియామిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు నిన్న డిల్లీలో ఇందిరా భవన్ లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతం నియామక పత్రాలను విడుదల చేసారు . ఈ సందర్భంగా పోతుల మల్లేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర లో ఎస్సీ ఉపకులాలను గుర్తిస్తూ నాకు రాష్ట్ర సెక్రటరీ గా నియమించడం చరిత్రత్మాకమని అన్నారు.టీపీసీసీ ఎస్సీసెల్ బలోపేతం కోసం కృషి చేస్తునే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు
పాటుపడతానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం గారికి కృతజ్ఞతలు తెలిపారు.