logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్థలం కబ్జా పైన ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసిన బిజెపి అధ్యక్షురాలు.

హైదరాబాద్:శ్రీ భారతీయ జనతా పార్టి

పత్తికొండ నియోజక వర్గం

యు. శాంతి

do: 25.5.2016

వెల్దుర్తి మండల అధ్యక్షులు :

మహారాజశ్రీ గౌరవనీయులై వెల్దుర్తి మండలము తహశీల్దార్ గారి దివ్యసముఖమునకు,

విషయం: చారసదొడ్డి గ్రామంలో సుంకులమ్మ గుడి సమీపంలో స్థలము ఖబ్జా చేసి, ఊరిలో నీరు పారకుండా అడ్డు వేసి, మురుగు నీరు నిల్ల వుండేలా చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొనుట గురించి,

అయ్యా !

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు ఉప్పరి రామాంజనమ్మ అయిన నేను నమస్కరించి వ్రాసుకున్న అర్జీ ఏమనగా,

వెల్దుర్తి మండలంలోని దాసర దొడ్డి గ్రామంలో పూర్వము నుండి తరతరాలుగా ఊరిలో నీరు, వాన నీరు పారుతున్న స్థలాలను ధాసరదొడ్డి గ్రామస్తులైన బోయ దేవేంద్ర ఇ/0 చిన్న రంగయ్య, గొల్ల లక్ష్మీనారాయణ 8/0 వల్లెపు రోగన్న అను వారు సదరు స్థలము వారిది అనుచూ ధౌర్జన్యముగా ఆక్రమించుకుని, వాన నీరు, ఊరిలో నీరు అడ్డుకట్ట వేసినారు. అందువలన ఊరిలో నీరు, వాన నీరు అంతా సుంకులమ్మ గుడి ముందు రచ్చకట్ట దగ్గర అంతా మురుగు నీరు నిలబడి సమీపంలో ఇళ్ళ వరకు దుర్గంధం వస్తున్నది, మురుగునీరు నిల్వ ఉంటే దొమలు పేరిగి మలేరియా వంటి అంటు రోగాలు వ్యాప్తి చెందుతాయి, మురుగునీరు కంపు వలన రచ్చ కట్ట దగ్గర ఎవరూ కూర్చోలేకుండా ఉంటారు. మురుగు నీరు సుంకులమ్మ గుడి వాలికి దగ్గర వరకు ఉన్నందున గ్రామ ప్రజలు భక్తులు సుంకులమ్మ గుడికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుచున్నారు.

కావున తమరు దాసరదొడ్డి గ్రామ ప్రజలందరి ఇబ్బందిని తమ దృష్టికి తీసుకొని వచ్చి వారికి పూర్వము నుండి ఊరినీరు, వాననీరు పారుతున్న విధముగా ఏ అడ్డంకు లేకుండా చేసి న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాను.

ఇట్లు,

బి.జె.పి. పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షురాలు

Resi :- వెల్దుర్తి గ్రామము & మండలము. కర్నూల్ జిల్లా.

Cell: 9642920496, 8919649659. email id:

4
708 views

Comment