logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ పాలకులు ఎందుకు దృష్టి పెట్టరు?

నా భారతదేశ హిందూ సహోదరులారా --- ఒకసారి ఆలోచించండి..నేడు చైనా తదితర దేశాలు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతుంటే..మన భారతదేశం విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం నకు, అనేక నేటి ప్రజల సమస్యలు పట్ల నేటి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఎందుకు దృష్టి సారించరు?--- శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ & సోషలిస్టు పార్టీ (ఇండియా)తరపున విన్నపం:

---- నాడిశెట్టి శాంతారావు -----
ఛైర్మన్ & ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ
సోషలిస్టు పార్టీ ( ఇండియా):


ఈ భారతదేశంలో ఓటును వేసే భారతీయ పౌరుడుగా నా హిందూ దేశ సోదరులనుండి , దేశ ప్రజలనుండి కోరుకునేది ఏమిటంటే... ప్రపంచ దేశాలు ఈ 77 సంవత్సరాలు మన భారతదేశాన్ని చూసి తలదించుకునేలా ఉండేవి. అన్ని దేశాల వారు , అన్ని రంగాలలో..అనగా వనరుల సంపద మొదలగు అనేక కోనా ల్లో పరిశీలన చేసినప్పుడు మన భారతదేశం అందరికంటే ముందు వరుసలో ఉండేది..కారణం ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండడాన్ని చూసి.. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలు చూసి మెచ్చుకునేవారని.. కానీ నేడు సత్యంతో పరిశీలించి చూస్తే ఆయా దేశాలతో పోల్చి చూస్తే..12వ,స్థానంలో ఉన్నా మని ఈ విషయం ప్రతిఒక్కరూ గ్రహించి ఆత్మ పరిశీలన చేసుకోవాలని..శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ & సోషలిస్టు పార్టీ (ఇండియా) ఛైర్మన్ & ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ నాడిశెట్టి శాంతారావు తన లేఖలో పేర్కొన్నారు. నిజానికి చైనా తదితర దేశాలు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతుంటే.. నేటి మన భారతదేశం అన్ని వనరులు, సంపద కలిగిన కానీ ఆదేశాల వేగానికి వెనుకబడి ఉన్నామంటే దానికి కారణం విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం ఇతరత్రా వాటికంటే మత పరమైన అంశాలకు, భావోద్వేగాలకే ఎక్కువ శాతం విలువైన సమయాన్ని కేటాయిస్తూ కాలాన్ని వృదా చేసుకుంటున్నామన్నది మరియు పైన తెలిపిన విద్యకు మరియు ప్రజలు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే వాటిని పరిష్కరించ వలసినది పోయి..ఇలా వాటికి ఇవ్వవలసి సమయాన్ని వాటి ప్రాధాన్యతకు బదులుగా కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని, మతతత్వంపైనా అధిక శాతం ఆధిపత్యం చెలామణీగా చూపడం కూడా ఒక కారణం కావచ్చు అని నా భావన అని నాడిశెట్టి శాంతారావు అన్నారు... ముఖ్యంగా చైనా విద్య, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో అదేశ ప్రజలతోపాటు, అనేక దేశాలు రాణిస్తుండగా, మన భారతదేశం అభివృద్ధి పట్ల కానీ, ప్రజల సమస్యల పట్ల కానీ, ఉత్పత్తుల పట్ల కానీ, పారిశ్రామిక కంపెనీలు లేదా చిన్న తరహా పరిశ్రమలు పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, పేదరిక నిర్మూలన పట్ల మొదలగునవి అనేక సమస్యల పట్ల పరిష్కారం కోసం ఆలోచించక కేవలం భారతదేశంలో మతపరమైన వివాదాలలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. వీటితోపాటు అభం శుభం తెలియని పసి ప్రాయంలో ఉన్న పిల్లలకు ఈ సెక్యులర్ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలు పాటించిన విధానాన్ని చూపించవలసినదిపోయి , వారికి పిన్న వయసులోనే మొదటి తరగతి నుండే " పాఠశాలల్లో సైన్స్ , గణితం కు బదులుగా మతపరమైన అంశాలతోపాటు దేవతావిగ్రహాల గూర్చి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం వలన మరియు మనం జీడీపీ, ఆవిష్కరణల మూలంగా వెనుకబడి ఉన్నామని శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ & సోషలిస్టు పార్టీ (ఇండియా) ఛైర్మన్ & ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ నాడిశెట్టి శాంతారావు అన్నారు. ఏదేమైనా ప్రతి పక్షాలు మద్దతు ఇవ్వడంతోనే ' జాతీయ వాది' అని ఆరోపిస్తున్నారేతప్పా... ముఖ్యంగా విద్య రంగంపై, తదితర రంగాల్లో అభివృద్ధి కోసం ఆలోచించకుండా.. అదేవిధంగా భారతదేశ ప్రజల అనేక సమస్యలపై దృష్టి పెట్టకుండా 5జీ, ఏఐ, అంతరిక్ష రంగాలలో చైనా ఆధిక్యంతో పోలిస్తే, భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు స్పష్టంగా ఉన్నాయి... ఇటువంటి తరుణంలో... మాతృత్వానికి ఇంత ప్రాధాన్యత అవసరమా???...పసి ప్రాయంలో ఉన్న పిల్లలకు విద్య సంస్కరణలు అవసరమా???... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ & సోషలిస్టు పార్టీ (ఇండియా) ఛైర్మన్ & ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ నాడిశెట్టి శాంతారావు లేఖలో ప్రభుత్వానికి సూచించారు.

28
767 views

Comment