logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
KANTIPAKA THRIMURTHULU
All India Media Association

డా బి ఆర్ అంబేడ్కర్ 65 వ, వర్థంతి సందర్భంగా ఘన నివాళులర్పించి న జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీ మోహన్


విజయ నగరం జిల్లా పరిధిలో లంకా పట్టణం, రౌతు వీదిలో  తే.06-12-2021ది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీ మోహన్, మరియు యర్రంశెట్టి త్రినాథరావు  మాట్లాడుతూ షెడ్యూల్ కులాలకు, తెగలకు, వెనుకబడినవారికి, స్త్రీలకు, అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలకు, అనేక రక్షణలు, రిజర్వేషన్లు, రాజ్యాంగంలోపొందు పరచి, కులాలు వద్దని, మనుష్యులు అందరూ ఒకటేనని, గాలికి, నీరుకి, వెలుతు రుకి, అగ్నికి లేని అంటరాని తనం వాటి ద్వారా జీవించే మనుష్యులకు ఎందుకని  ప్రశ్నించిన మహాను భావుడు డా బి ఆర్ అంబేడ్కర్ గారని, తర తరాలుగా అనచి వేతను, అన్యాయానికి గురవుతున్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాంగ పరమైన రక్షనలు, హక్కులు, కల్పించిన ప్రపంచ మేధావి భారత రత్న గ్రహీత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ గారని, ఆర్థిక శాస్త్ర వేత్త, ప్రముఖ భారతీయ న్యాయవాది, భారత దేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందనీ అన్నారు ఈ యన తే. 14-04-1891 దీ న జన్మించారని తేది 06-12-1956 న మరణించారని ఈ సందర్బగా  తేది1956- 12-06 న ఢిల్లీ లో శ్రద్దాంజలి ఘటించారని తెలిపారు.

..........
0
16 views    0 comment
0 Shares

15
507 views    1 comment
6 Shares

3
1829 views    0 comment
1 Shares

0
235 views    0 comment
0 Shares

0
336 views    0 comment
0 Shares

0
306 views    0 comment
0 Shares

2
753 views    0 comment
3 Shares

విజయనగరం జిల్లా: విజయనగరం పట్టణం రెవెన్యూ కల్యాణ మండపంలో ఆగస్టు 24 మంగళవారం నాడు కోవింద్ సేవా పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా విశాఖ జిల్లా రేంజ్ డిఐజి రంగారావు విశిష్ట అధికారులు గా జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ మరియు జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బి శెట్టి బాబ్జి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా రేంజ్ డిఐజి ఎల్ కె వి రంగారావ్ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కోవిద్-19 2nd వేవ్ లో ప్రజానీకం కకావికలం అయ్యింది అటువంటి భయానక పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి అధికార యంత్రాంగంతో పాటు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఎందరో దాతృత్వం కలిగినవారు సేవలు అందించి *కోవిద్ వారియర్స్* గా శ్రమించారు. ఆ త్యాగశీలురి సేవలను గుర్తు చేసుకుంటూ *విజయనగరం యూత్ ఫౌండేషన్* కోవిద్ సేవా పురస్కారాలను అందిస్తున్నారని, ముఖ్యంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ స్థాపకుడు షేక్ ఇల్త మాస్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కోవిద్ కష్టకాలం సమయంలో కోవిద్ బారినపడి మరణించిన అనాధ శవాలకు యూత్ ఫౌండేషన్ సభ్యుడు అంబులెన్స్ శివ తో కలసి దహన సంస్కారాలు చేసి ఉన్నారనితెలిపారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ విజయనగరం జిల్లా కే పేరు ప్రఖ్యాతలు తేవాలని అభినందించారు. జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ ఐ పి ఎస్ మాట్లాడుతూ విజయనగరం యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ ఇల్త మాస్ అన్నార్తుల కోసం మయూరి జంక్షన్ కూడలి లో ఫుడ్ బ్యాంకును స్థాపించి ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం ఆనందదాయకమని మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని విజయనగరం పోలీసుశాఖలో విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం విశాఖ జిల్లా డి ఐ జి ఎల్ కె వి రంగారావు , జిల్లా ఎస్పి ఎమ్ దీపికా పాటిల్ చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులకు విజయనగరం యూత్ సభ్యులకు కోవిద్ సేవ పురస్కారం అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా డి ఐ జి ఎల్ కె వి రంగారావు, జిల్లా ఎస్పి దీపికా పాటిల్, పౌర వేదిక అధ్యక్షులు బి శెట్టి బాబ్జి, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు మరియు ప్రజానీకం పాల్గొన్నారు.

..........
5
436 views    0 comment
4 Shares

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రతిభావంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను ఉగాది 2020- 21 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన పేర్లు. 1, కె రమేష్ ఏ ఆర్ హెచ్ సి ఉత్తమ సేవ పథకం. 2, కె ఏసురత్నం ఏ ఆర్ హెచ్ సి ఉత్తమ సేవా పథకం. 3,యు నర్సింగరావు ఆర్ ఎస్ ఏ కఠిన సేవా పథకం. 4, కె రమేష్ ఆర్ ఎస్ ఏ కఠిన సేవా పథకం. అదేవిధంగా ఉగాది 2021 కి గాను. 5, ఎం డి ప్రసాద్ రావు ఆర్ ఎస్ ఎస్ ఏ మహోన్నత సేవ పథకం. 6, పి నాగేశ్వరరావు ఆర్ ఏ ఎస్ టి ఎఫ్ ఉత్తమ సేవా పథకం. 7, యమ్ పైడిరాజు పి సి కంట్రోల్ రూమ్ ఉత్తమ సేవా పథకం. అను వారికి రాష్ట్ర ప్రభుత్వం. అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పథకాలకు, ఉత్తమ సేవా పథకాలు, మహోన్నత సేవ పథకాలు, కఠిన సేవా పథకాల కు ఎంపిక చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేతులమీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 75 వ, స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో ప్రధానం చేశారు. పోలీసు శాఖలో ప్రతిష్టాత్మకంగా భావించే పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు అభినందించి భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి లు, సిఐలు, ఆర్ ఐ లు, ఎస్సైలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

..........
2
1783 views    0 comment
0 Shares

0
326 views    0 comment
0 Shares

ఆగస్ట్ 10 బుధవారం నాడు విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయనగర నియోజకవర్గ శాసనసభ్యుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మారిటైం చైర్మన్ వెంకటరెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ. మారిటైం చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి నియమితులు కావడం తనకు వ్యక్తిగతంగా సంతోషంగాా ఉందన్నారు. జిల్లా కోటాలో సమర్థవంతుడైన నాయకునికి పదవి ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. . ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ రాజకీయంగా వైయస్సార్ పార్టీ ని మరింత పటిష్టవంతం చేయాలని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ పదవికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ కొత్త పోర్టులు వచ్చే విధంగా కృషి చేస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. ఈ సందర్భంగా మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి జిల్లా ఎమ్మెల్యే కోలగట్ల ను ఉచిత రీతిని సత్కరించారు.

..........
0
1003 views    0 comment
1 Shares

విజయనగరం: ఆగస్టు 10 మంగళవారం జిల్లా లోని ఉపాధ్యాయులందరికీ కోవిద్ వ్యాక్సి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం లో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల తో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు శతశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ కావలసినవారు జిల్లాలోని ఏ పి హెచ్ సి కి వెళ్ళిన వ్యాక్సినేషన్ వేసుకోవచ్చని సూచించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాల కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్: 08922275279-0892227950 లకు సంప్రదించవచ్చు నని సూచించారు. ఈ సమావేశంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ ఎస్ వి. రమణ కుమారి, డి ఈ ఓ జి .నాగమణి తదితరులు పాల్గొన్నారు.

..........
7
3246 views    0 comment
11 Shares

విజయనగరం జిల్లాలో దిశ (ఎస్ ఓ ఎస్ )కు అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా ఎస్పి తెలిపారు. ఆగస్టు 10 మంగళవారం నాడు మహిళల రక్షణకు ప్రతి మహిళా స్మార్ట్ ఫోన్ ల లో దిశాయాప్ఉన్నట్లయితే మీ రక్షణకు మరో మనిషి మీకు తోడుగా ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ అన్నారు. దిశా యాప్ పట్ల.మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు కు వారితో మమేకం అవుతున్నా మన్నారు. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించి 3.20 లక్షల మంది స్మార్ట్ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గత 25 రోజులలో 1456 టెస్ట్ కాల్స్ వచ్చాయన్నారు. ప్రతి ఫోన్ కాల్ సిబ్బంది స్వీకరించి వివరాలు తెలుసుకొని సంఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించి చర్యలు చేపడుతున్నామన్నారు. దిశ యాప్ కు వచ్చిన కాల్స్ లో చాలా వరకు భర్త వేధిస్తున్నారని మరియు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ,అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి అన్నారు. 1,విజయనగరం పట్టణంలో ఒక మైనర్ బాలికను పట్టణానికి చెందిన వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన ట్లుగా జూన్ 28 దిశ (ఎస్ ఎస్) కు ఫిర్యాదు రావడంతో 2వ పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించి అతనిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేశారన్నారు. 2,పాచిపెంట కు చెందిన ఒక వ్యక్తి దిశా (ఎస్ ఓ ఎస్) కు ఫిర్యాదు చేస్తూ తన కుమార్తెను ప్రేమ పేరుతో ఒక వ్యక్తి వేధించి మోసగించాడని తెలపడంతో స్పందించిన పోలీసులు అతనిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కావున మహిళలు, విద్యార్థినులుు, పోలీసుల సహాయాన్ని సకాలంలో పొందాలని జిల్లా ఎస్పి కోరారు.

..........
7
362 views    0 comment
7 Shares

2
1146 views    0 comment
20 Shares

0
512 views    0 comment
1 Shares

విజయనగరం: ఆగస్టు 4 బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ను ప్రిసైడింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ నిర్వహించారు

. ఈ ఎన్నికల్లో 36వ, డివిజన్ కార్పోరేటర్ బాలి పద్మావతి మరియు 13 వ, డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి పేర్లను ప్రతిపాదించారు.

21 వ, డివిజన్ కార్పొరేటర్ కనకల నాగవల్లి రేవతి దేవి పేరును బలపరిచారు. వేరే వ్యక్తి పేరును సమావేశంలో ఎవరు ప్రతిపాదించక పోవడంతో మిగిలిన సభ్యులు రేవతీదేవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రిసైడింగ్అధికారి ప్రకటించారు. 5 గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్ర స్వామి హాజరయ్యారు. రేవతీదేవి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించిన నిమిత్తం ప్రిసైడింగ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ గా ఉండే ముచ్చునాగలక్ష్మి ఆకస్మిక మరణం తో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే నిమిత్తం జరిగిన ఎన్నికలలో రేవతి దేవిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని తెలిపారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి రేవతి దేవికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. రేవతీదేవి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనందుకు సహకరించిన ఎమ్మెల్యే కోలగట్ల కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవికి సార్ధకం చేసే విధంగా కృషి చేస్తానని, సభ్యులందరి సహాయ, సహకారం తో నగరాన్ని మరింత అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేస్తూ అత్యున్నత స్థానాల్లో పదవులను కోలగట్ల అందించారన్నారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, సహాయ కమిషనర్ వరప్రసాద రావు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

..........
0
376 views    0 comment
0 Shares

0
1311 views    0 comment
0 Shares

8
930 views    0 comment
1 Shares

12
2476 views    0 comment
10 Shares

   విజయనగరం:    జూలై 29 గురువారం నాడు బొండపల్లి మండలం, అంబటి వలస గ్రామం లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఇళ్లను అఖిలభారత మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడు పరిశీలించగా లబ్ధిదారులు పలు విన్నపాలను విన్నవించారు. నింగిని తాకుతున్న ధరలతో ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు?.                                                                                                                                                                    ఈ సందర్భంగా కొత్తలి గౌరి నాయుడు మాట్లాడుతూ  700 రూపాయల విలువ ఉన్న రాయి 2200 రూపాయలకు చేరుకుందని, సిమెంట్ బస్తా 220,  రూపాయలు నుంచి 450 రూపాయలకు చేరుకుందని, కూలి ఖర్చు 250 రూపాయల నుంచి 450 రూపాయలకు పెరిగిపవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వము అందజేస్తున్న 1,80,000, రూపాయలు పునాదుల నిర్మాణానికి సరిపోదని, ఇటువంటి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి  ఇండ్ల నిర్మాణం చేపట్టాలా వద్ద అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక  సహాయాన్ని పెంచే విషయంలో మరొకసారి పునరాలోచించాలని గౌరినాయుడు కోరారు.

..........
9
295 views    0 comment
3 Shares

విజయనగరం: జూలై 29 గురువారం లక్కవరపుకోట మండల కేంద్రంలోని లక్కవరపుకోట జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులను, పది కేజీల గంజాయిని మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం లక్కవరపుకోట పోలీసువారికి అప్పగించడం జరిగింది.                                                                                                                                                 ఈ దాడి లో లక్కవరపుకోట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మణరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కానిస్టేబుల్ పోతురాజు పాల్గొన్నారు.

..........
8
487 views    0 comment
1 Shares

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జరజారావుపేట గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎల్.ఎ బడ్డుకొండ అప్పలనాయుడు సూచనలు, సలహాల మేరకు నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ సముద్రపు రామారావు ఆధ్వర్యంలో కొండవెలగాడ ఫిజికల్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎస్ ప్రశాంత్ రాజు ప్రత్యేక చొరవ తీసుకుని జరజారావుపేట అర్బన్ ఫిజికల్ హెల్త్ సెంటర్ కి 400, డోసులు కేటాయించి నందున అర్బన్ ఫిజికల్ హెల్త్ సెంటర్ అధికారి డాక్టర్ జి వెంకటేష్ పర్యవేక్షణలో హెల్త్ సూపర్ వైజర్ తిరుపతి నాయుడు, ఏ ఎన్ ఎం గౌరీ లక్ష్మి, ఆశ వర్కర్లు సహాయంతో, సచివాలయం సెక్రటరీస్,  వాలంటీర్స్, యువత సేవలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది.                                                                                                                                        .                                 ఈ సందర్భంగా నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు   జరజారావుపేట గ్రామానికి 400, డోసులు వ్యాక్సినేషన్ తెప్పించారని  గ్రామంలో 6, వార్డులు  8, వేల జనాభా కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా అందిస్తామని తెలిపారు. థర్డ్ వేవ్ కోవిద్ ని ఎదుర్కోవడానికి కోవిద్ వ్యాక్సినేషన్ అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. 18 సంవత్సరముల వయస్సు నుండి  60 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని, గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అలాగే బాలింతలు కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలియజేశారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ ఎనభై నాలుగు రోజుల తరువాత వేయించుకోవాలని స్పష్టంగా తెలిపారు.   రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేయించు కున్న వారు కూడా  ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక భౌతిక దూరం పాటించాలని, డబల్ మాస్కులు ముక్కు కు పై వరకు ధరించాలని, శానిటైజర్ తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అని తెలియజేశారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     ఈకార్యక్రమంలో  18 వ, వార్డు కౌన్సిలర్ నల్లి శ్రీను, 19 వ, వార్డు కౌన్సిలర్ తుమ్ము నారాయణమూర్తి, డి సి సి బి బ్యాంకు ప్రసిడెంట్ పెనుమత్స అప్పలరాజు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు పోలు బోతు నారాయణ మూర్తి, రాష్ట్ర  నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు, యువ నాయకులు అవనాపు విజయ భాస్కర్ రావు, సముద్రపు సత్తిబాబు, వెంకటరమణ, మద్దిల దుర్గారావు, నల్లి శివ, వైయస్సార్ సిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

..........
6
1103 views    0 comment
15 Shares

42
2641 views    0 comment
18 Shares