బీసీలు అంతా ఐక్యమత్యం అవ్వాలని హర్యానా గవర్నర్ పిలుపునివ్వడం జరిగింది.
హైదరాబాద్:మాట్లాడుతున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బీసీలు సంఘటితం కావాలి
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బీసీలు రాజకీయాలకు అతీతంగా సంఘటిత శక్తిగా ఎదిగినప్పుడే వివిధ రంగాల్లో వారి ప్రయోజనాలు నెరవేరుతాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 'మన ఆలోచన సాధన సమితి' ఆధ్వర్యంలో నిర్వహించిన 'బీసీ జనజాగరణ జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీల్లో చైతన్యం పెరగాలని, ముఖ్యంగా బీసీ ఉద్యమాల్లో మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులవృత్తులు హిందూ ఆధ్యాత్మిక భావాలతో ముడిపడి ఉన్నాయని, మన సంస్కృతి, ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై సూచించారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ.. బీసీలు అడుక్కోవడం కాదు.. తమ హక్కులను లాక్కోవడం నేర్చుకోవాలని అననారు. ఇది ఐక్యత, బల ప్రదర్శన ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్. ఎంపీ ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Mon, 20 April 2026