ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ ర్యాలీ
తొర్రూర్ ఏప్రిల్ 15 తొర్రూరు డిపో మేనేజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక డిపో నుండి గాంధీ సెంటర్ వరకు కొనసాగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం సురక్షితంగా ఇంటికి వెళ్దాం అంటూ ర్యాలీ తో ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్ సెంటర్ వద్ద స్థానిక ఎస్సై జి ఉపేందర్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ డ్రైవర్లు వాహనాలు నడపాలని, మధ్య సేవించి వాహనాలు నడపవద్దని అన్నారు . డిపో మేనేజర్ పద్మావతి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు పై వెళ్లేటప్పుడు సైతం విధిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ, ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , ఎం . ఎఫ్ విజయ్ కుమార్, ఎస్ టి ఐ రజిత రెడ్డి, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.