జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డు
స్వీకరించిన ఇమ్మడి రాంబాబు.
విశిష్ట రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాల అందజేత
తొర్రూరు ఏప్రిల్14 విశిష్ట రంగాల్లో కృషి చేసిన వారికి హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపకులు మంగళపల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయడం అభినందనీయమని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు మంగళవారం డివిజన్ కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఝాన్సీ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఆయా రంగాల్లో కృషిచేసిన పలువురికి హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధానం. తొర్రూర్ పట్టణానికి చెందిన కవి ,జర్నలిస్టు, వివిధ రంగాలలో తనదైన సేవలందిస్తున్న ఇమ్మడి రాంబాబు నిర్వాహకుల చేతుల మీదుగా జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి అంబేద్కర్ అవార్డు ను స్వీక రించారు. హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ తో కలిసి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు.అంబేద్కర్ ఆశయాల సాధనకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని ఎంపిక చేసి అవార్డులు అందజేయడం జరిగిందని హుస్సేన్ అన్నారు
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు
హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ సేవలు హక్కుల కోసం సంస్థ పనిచేయడం అభినంద నీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మచ్చ సురేష్ ప్రముఖ న్యాయవాది జెట్టి శ్రీనివాస్ ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు గొల్లపెల్లి మహేష్. అశోక్ గౌడ్, డివిజన్ కమిటీ సభ్యులు కుమ్మరి రామ్మూర్తి, డివిజన్ ప్రెసిడెంట్ పల్లెర్ల రమేష్,మండల ప్రెసిడెంట్ ఉమేష్,సతీష్,కుంభం మహేష్ గౌడ్,శ్రీనివాస్,మహంకాళి మల్లేష్, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. తన సేవలను గుర్తించి అవార్డును అందజేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను రాంబాబు అన్నారు