logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బిజెపి 47వ ఆర్భావ దినోత్సవం.

హైదరాబాద్:ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాను.

1984లో 2 స్థానాల నుండి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం, గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం.. "దేశమే ప్రథమం" అనే మన జాతీయవాద సిద్ధాంతంపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి సజీవ సాక్ష్యం.

ప్రధాని గారి అద్భుత దార్శనికతతో 'వికసిత్ భారత్' దిశగా దేశం సగర్వంగా ముందడుగు వేస్తుండగా.. మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు మరియు సంక్షేమానికి కేంద్రం అందిస్తున్న రికార్డు స్థాయి నిధులతో 'వికసిత్ తెలంగాణ' సైతం సాకారం అవుతోంది.

పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక కాదు, ఇది త్యాగం, సేవాభావం, మరియు జాతీయ పునర్నిర్మాణ సంకల్పంతో నిర్మితమైన ఒక మహా ఉద్యమం. "అంత్యోదయ" స్ఫూర్తితో, "సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" మంత్రంతో నిస్వార్థంగా దేశ సేవ చేస్తున్న క్రమశిక్షణ గల కార్యకర్తలే పార్టీకి అసలైన బలం.

కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

#47YearsOfNationFirst

0
57 views

Comment