logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందజేత

తొర్రూరు ఏప్రిల్ 2 (AIMEDIA ) సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనందించాలని పిడిజి లయన్ డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామ నరసయ్య లు అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మండలంలోని సోమారం గ్రామపంచాయతీకి బాడీ ఫ్రీజర్ బాక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. సర్పంచ్ కొమురవెల్లి లింగమూర్తి మాట్లాడుతూ డాక్టర్ రాజేందర్ రెడ్డి మంచి పేరున్న డాక్టర్ అని మనసున్న నియోజకవర్గంలోనే గొప్ప పేరున్న సమాజ సేవకులని సొంత ఊరుకు ఉపయోగ పడేలా సేవా దృక్పథం తో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే తమ కుటుంబ సభ్యులు వచ్చేదాకా పార్టీ దేహాన్ని నిల్వ ఉంచడం కోసం ఫ్రీజర్ బాక్స్ అందజేయడం పట్ల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు లక్ష్మీనరసింహ రావు, టి వెంకటరెడ్డి, విశ్వేశ్వరరావు, లయన్స్ క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

8
294 views

Comment