logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి ఎం. రమాజ్యోతి

హైదరాబాద్:22/03/2026
ప్రముఖ పారిశ్రామికవేత్త, లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, బిలీఫ్ హాస్పిటల్స్ మరియు బిలీఫ్ ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ శ్రీమతి ఎం. రమాజ్యోతి గారు శంషాబాద్‌లోని Rajiv Gandhi International Airport వద్ద కేంద్ర ప్రభుత్వ మంత్రి B. L. Verma గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి ఎం. రమాజ్యోతి గారు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ, అలాగే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖల రాష్ట్ర మంత్రిగా (MoS) బాధ్యతలు నిర్వహిస్తున్న బి. ఎల్. వర్మ గారికి శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

ప్రముఖ వ్యాపారవేత్తగా, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న మహిళగా శ్రీమతి ఎం. రమాజ్యోతి గారు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆరోగ్య రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తూ అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తూ, సమాజ సేవలోనూ తన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. వైద్య సేవలతో పాటు పేద ప్రజలకు సహాయం, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
తన కృషి, పట్టుదల, నాయకత్వ లక్షణాలతో శ్రీమతి ఎం. రమాజ్యోతి గారు మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ, వ్యాపార రంగంలో విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. వ్యాపారం మరియు సేవను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
ఈ భేటీ సందర్భంగా పరస్పరంగా అభిప్రాయాలు పంచుకోగా, సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది

0
0 views

Comment