బంజారాహిల్స్ లో రోడ్డు విస్తరణ ఆపండి.
హైదరాబాద్:బంజారాహిల్స్ రోడ్డు విస్తరణ ఆపండి: హైకోర్టు
బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి ఆదేశించింది.
భూసేకరణ చట్టం సెక్షన్ 21 కింద నోటీసులు ఇచ్చే వరకు తదుపరి చర్యలు ఉండవని, పిటిషనర్ల ఆస్తులపై స్టే వర్తిస్తుందని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ను 2 పత్రికల్లో, ఒకటి స్థానిక భాషలో ప్రచురించాలని సూచించింది.
తదుపరి విచారణ ఏప్రిల్ 7కి వాయిదా పడింది.