బిజెపి సిటీ ఆఫీసులో బిజెపి శిక్షణ తరగతులు.
హైదరాబాద్:బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు గారి అధ్యక్షతన, జీహెచ్ఎంసీ పరిధిలో గల 9 జిల్లాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీ అభయ్ పాటిల్ గారు, బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారి గారు, ఎమ్మెల్సీ శ్రీ సి.అంజి రెడ్డి గారు, మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, రాష్ట్ర స్థాయి సంస్థాగత నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర - జిల్లా స్థాయి పదాధికారులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.