logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా పరాభవ ఉగాది వేడుకలు ఆకట్టుకున్న కవి సమ్మేళనం

తొర్రూర్, మార్చి 19:
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని మురళీకృష్ణ మందిరంలో సారంగీశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణమును అర్చకులు చేపట్టారు. కంటాయపాలెం రోడ్డులో గల స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వికాస తరంగిణి తొర్రూరు శాఖ, లయన్స్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో విష్ణు సహస్రనామ పారాయణము, పంచాంగ శ్రవణ పఠనం, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఓలేటి యాదగిరిచార్యులు, ఆరుట్ల శ్రీకాంతాచార్యులు పంచాంగ శ్రవణ పఠనం చెబుతూ ఈ పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఆదాయ, వ్యయాలు యోగక్షేమలను తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు డాక్టర్ కుందూరు రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ కవి లక్ష్మీనరసింహ రావు అధ్యక్షతన కవి సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం కోఆర్డినేటర్, తెలంగాణ సామాజిక రచయితల జిల్లా అధ్యక్షుడు, కవి ఇమ్మడి రాంబాబు, కవులు కృపాకర్ రాజు, కస్తూరి పులిందర్, ధోనికన కుమారస్వామి, బోనగిరి పాండురంగ, సూరం ఉపేందర్ రెడ్డి, కృపాకర్ రాజు, నాల్లం శ్రీనివాస్, గట్టు నవీన్, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గాయకులు గుమ్మడవెల్లి మధు, దారా నాగ శివప్రసాద్ లు పాల్గొని పరాభవ నామ సంవత్సర ఉగాది విశిష్టతను సామాజిక అంశాలపై తమ కవిత గానాన్ని వినిపించగా , వీరిని ఆలయ నిర్వాహకులు ,వికసతరంగిణి లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ యాదగిరి రెడ్డి,బోనగిరి శంకర్, కొనే ప్రభాకర్ తమ్మి ఉపేందర్ రేగూరి వెంకన్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రామ్ నరసయ్య, సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డిలు కవులకు, గాయకులు కొత్తపల్లి మధు దారా నాగేశ్వరప్రసాద్ లకు ఫలములు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు .అనంతరం తమ్మి రమేష్ కరుణశ్రీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి, పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా తమ్మెర లక్ష్మీనరసింహారావు డాక్టర్ రాజేందర్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరికీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే పండుగ అని అన్నారు.ఆ పరాభవుడు సర్వేశ్వరుడు శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం ను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పట్టణ వ్యాపార ప్రముఖులు భక్తులు వికాస తరంగిణి సభ్యులు పుందుల గీతారెడ్డి ప్రసూన శోభ, శశికళ రేణుక , తదితరులు పాల్గొన్నారు

6
48 views

Comment