logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యార్థి దశలో సాహిత్యం పై మక్కువ పెంచాలి తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు సమాజాన్ని జాగృతం చేసేది కవిత్వం

తొర్రూరు మార్చి 20 : విద్యార్థి దశలో సాహిత్యం పై మక్కువ పెంచాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు కోరారు. ప్రపంచ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ కవి అలాంటివాడో సమాజానికి ఏం చెప్తాడో తన మాటల్లో ఇలా
సమాజాన్ని జాగృతం చేసేది కవిత్వం
కవులు ప్రపంచ జ్ఞాన దీపికలు.
రవి గాంచని చోట కవి గాంచును
జగతిన విజ్ఞాన వీచికలు
సత్య వాక్కులు అందించే వాగ్దేవి వారసులు
అజ్ఞాన తిమిరాన్ని తొలగించే అక్షర భాస్కరుడు
సాగరం లో సాగే.. నావకు చుక్కాని
వినీలాకాశం లో వెన్నెల రేడు
సప్తవర్ణాల మిళిత శోభితుడు
పంచభూతాల భవుడు
పసిడి పలుకులు పలికే పంచవన్నెల చిలుక
అరిషడవర్గాల.. అదుపుచేసే..
అరుఋతువుల్లో.. అక్షర యోధుడు
త్రిమూర్తులు.. సృష్టి స్థితి లయ కారులైతే
తరతరాలలో... చరిత కారులు..
చిరంజీవులు.. వాణి హస్తభూషణలు
నవ జీవితానికి.. నడిచే దైవాలు..
సమ సమాజ స్థాపన లో మూల స్తంబాలు..
సకల చరా చర.. సృష్టిలో.. నిత్య భాస్కరుడు
కవి.. రవి కాంచని.. చోట కవి గాంచును
సార్ధకం.. అనిర్వచనీయం.. కవి అని అన్నారు.
పాఠశాల స్థాయిలో ఉన్న తెలుగు ఉపాధ్యాయులు నాగబావయుక్తంగా విద్యను బోధించినప్పుడు విద్యార్థులకు భాష పై మక్కువ పెరుగుతుందని అలాంటి బోధనలను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు కవిత్వం , రచన కథానిక ఇలాంటి సాహిత్య ప్రక్రియలు హాజరమరమని ఒక సినిమాలో ఒక పాట హిట్ అయితే దానికి మూలం ఆ పాట రాసిన రచయిత కవి ,అని ఒక పాఠ్యాంశం లోకి వెళ్తుంది అంటే ఆ పాఠ్యాంశం రచన చేసిన వారిదేనని అందుకే విద్యార్థి దశలో భాష పై మక్కువ పెంచాలని ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రభుత్వాలు. కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

పూర్వీకులు. అలాంటి గొప్ప రచన శైలి భావ చిత్రీకరణ వర్ణన కవిత్వం కి మాత్రమే సొంతం. కవి తన ఆలోచనలకు పదును పెడుతూ కవిత్వాన్ని రంజింపచేస్తాడు కవిత్వం అనేది మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. కవిత్వం అనేది కొత్త పదాల కలయిక .కవిత్వము అజరామరం. కవిత్వంలో పట్టుంటే దేన్నైనా పట్టు విడవకుండా సాధించవచ్చునని పెద్దలు చెప్తుంటారు.కవిత్వం ఒక సందేశం. కవులు చెప్పదలచకున్న భావాలను తమ స్వంత మాటలతో,చలొక్తు లతో వర్ణించడం కవి లక్షణం.తెలంగాణ ఉద్యమం సమయం లో లక్షలాది కవులు తమ కవిత్వాలు రాసి వినిపించి తెలంగాణ రాష్ట్ర కాంక్ష ను నెరవేర్చారు. కవిత్వం అజరామరం.కవి కి గొప్ప ఆలోచన వుండి ప్రతీ వస్తువు మీద తన రచన చేస్తూ చెప్పవచ్చును.
ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవిత్వ దినోత్సవం నిర్వహించబడుతుందనీ, కౌలకు భాషాభిమానులకు ప్రపంచ కవిత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

0
0 views

Comment