ప్రతి స్త్రీ మాతృమూర్తి.. అమ్మ విలువ చాటి చెప్పిన నాటిక స్త్రీ మాత్రే నమః
ఘనంగా 14వ జాతీయ చైతన్య కళాశాల మధ్య నాటక పోటీలు ప్రారంభం
తొర్రూరు మార్చి 10 :
ప్రతి స్త్రీ మూర్తి మాతృమూర్తి అవుతుందని మగాడు అమ్మ ప్రేమను పంచ లేడని ఇది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆ బాధ్యతను తెలియజేసిన ప్రేక్షకులను కట్టిపడేసిన నాటిక స్త్రీ మాత్రే నమః ఈ నాటిక మూల కథ శ్రీమతి పూర్ణిమ తిమ్మరాజు రచన దర్శకత్వం ఉదయ భాగవతుల నిర్వహించగా ఈనాటిక ప్రేక్షకులను అమ్మ విలువ తెలుసుకునేల చేసింది . చైతన్య కళా సమైక్య తొర్రూర్ ఆధ్వర్యంలో 14 జాతీయ తెలుగు ఆహ్వానిత నాటిక ప్రదర్శనలు సోమవారం రాత్రి కళావేదికపై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమం అధ్యక్షులు మన్నూరు ఉమా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముందుగా సంస్థ సభ్యుడు గజ్జల ఉపేంద్ర చారి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ నాటక సమాజాన్ని బ్రతికిస్తున్నది ప్రోత్సహిస్తున్నది జిల్లాలో చైతన్య కళా సమాఖ్య మాత్రమే అని అన్నారు వరంగల్ జిల్లాలో మొదటగా భారతీయ నాటక కళాపరిషత్ అయితే మహబూబాబాద్ జిల్లాలో కళా సమాఖ్య అని చెప్పటంలో ఇంత గర్వకారణం అని అన్నారు. బుల్లితెర వెండితెరలపై మనం చూసే సినిమాలు గానీ సీరియల్ గానీ అందులో నటీనటులు పలుసార్లు నటించాల్సి వస్తుందని అదే నాటికలు ప్రేక్షకుల ముందు నటీనటులు వారి పాత్రలలో లీనమై వ్యక్తి కట్టిస్తారని అప్పుడే ప్రేక్షకులు హృదయాలలో చిరస్థాయిగా పోతారని అన్నారు. ఈ నాటిక పోటీలు నిర్వహించడం ఎంతో వ్యయ ప్రయాసలకు కూడుకున్నదని నాటిక ప్రదర్శనలకు రెండు నెలల శ్రమ చేయాల్సి వస్తుందని ఇంత ఆదరణ పొందడానికి కారణం ప్రేక్షకులు దాతలు కళాపోషకులు కళాభిమానులేనని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మహిళ ప్రేక్షకులను ప్రోత్సహించడానికి పట్టణంలోని దీపా ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో లక్కీ డీప్ నిర్వహించి ఇద్దరు మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా దీప ఫ్యాషన్స్ అధినేత దీపా అనిల్ కుమార్ మాట్లాడుతూ నాటక సమాజాన్ని బ్రతికించడానికి సంస్థ సభ్యులు సమీకృతంగా చేస్తున్న కృషి ఎంత అభినందనీయమని ఒక రెండు గంటల పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే నాటికలను ప్రదర్శించడం నాటక ప్రదర్శనలో ఉన్న గొప్పదనాన్ని ఆస్వాదించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు మన్నూరు ఉమా వర్కింగ్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మంగళంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కల్వకులను జనార్దన్ రాజు పట్నంషేట్టి శ్రీశైలం ,ప్రధాన కార్యదర్శి పినాకపాణి, కోశాధికారి గడల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుధారపు శ్రీనివాస్ సాహిత్య కార్యదర్శి ఇమ్మడి రాంబాబు, వార్డు కౌన్సిలర్ నాటిక వారితోషిక దాత ముద్దసాని సురేష్,చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు ఆకుల సదానందం సంస్థ సభ్యులు మయూరి వెంకన్న, గాండ్ల వెంకన్న , రామగిరి ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు