logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ

తొర్రూరు మార్చి 7(AIMEDIA. )విద్యార్థులు యువత చదువుతోపాటు నాయకత్వ లక్షణాల పెంపుపై శ్రద్ధ చూపాలని, ఎన్ఎస్ఎస్ లో చేరితే అలాంటి లక్షణాలు పెంపొందుతాయని కాకతీయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ తెలిపారు. మహోబా జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోలగాని రాములు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికసిత్తు భారత్ యూత్ పార్లమెంటు సమావేశాలతో విద్యార్థులలో లీడర్షిప్ క్వాలిటీస్, సమాజంలో కొనసాగుతున్న పరిణామాలపై మరింత అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయి అన్నారు. ఇచ్చిన అంశంపై మూడు నిమిషాలు అనర్గళంగా మాట్లాడిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ సమావేశం విద్యార్థులకు గొప్ప వరమనారు. విద్యార్థి దశలో ఉంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే విద్యార్థుల్లో ఉన్న ఆందోళన భయము, స్టేజీపియర్ వంటివి తొలగిపోతాయన్నారు. చదువుతోపాటు రాజ్యాంగం పార్లమెంటు వంటి వాటిపై మరింత అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ముఖ్య నాయకులుగా ఎదగటానికి ఇలాంటి కార్యక్రమాలు దిక్సూచిలా పనిచేస్తాయి అన్నారు. అనంతరం ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వయకర్త మర్సకట్ల అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డాక్టర్ వి రాజేందర్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ డాక్టర్ ఎం రెడ్డప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ మొహమ్మద్ అర్జున్ అలీ,కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్తలో డాక్టర్ సుజాత డాక్టర్ వాల్య నాయక్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శాంతి కుమార్, అధ్యాపకులు డాక్టర్ పార్వతి డాక్టర్ సునీల్, డాక్టర్ అంజుఆరా, రవీందర్ రెడ్డి కృష్ణవేణి, వెంకన్న విజయ్ రాధిక రజిత అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

1
67 views

Comment