ఆర్థిక శాఖ మంత్రి కుమారుడు వివాహానికి హాజరైన ప్రముఖులు.
హైదరాబాద్:మా కుమారుడు సూర్య విక్రమాదిత్య మల్లు వివాహం సాక్షితో హైదరాబాద్‌లోని శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది.
దేశ, రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.
రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులను ఆత్మీయంగా పలకరించుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. మా కుటుంబానికి చూపిన ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.