కోడిపందాల నిర్వాహకుల అరెస్టు
తొర్రూరు మార్చి 3 (AIMEDIA) మండలంలోని గుంటూరు గ్రామ శివారులో కోడిపందాల నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఉపేందర్ ఒక ప్రకటనలు తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తూరు గ్రామ శివారులో గల మామిడి తోటలో కోడిపందాలను నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయగా కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు 65,400 రూపాయలు ,17 కోళ్లు , 4 సెల్ ఫోన్లు,3 మోటర్ సైకిల్లు మరియు ఒక బొలెరో వాహనం ను సీజ్ చేసి నిర్వాహకులునిందితుల వివరాలు
1)గుంజ వెంకటేష్ తండ్రి కోటయ్య , వడ్డెర, తార్ సింగ్ భాయ్ తండా వద్ద ఇటుక బట్టి నిర్వాహకుడు
2) అల్లం హుస్సేన్ తండ్రీ పుట్టయ్య, బేడ బుడగ జంగాల, తొర్రూర్
3) అల్లం ప్రసాద్ తండ్రి కోటయ్య, బేడ బుడగ జంగాల, తొర్రూర్
4) కిన్నెరసారయ్య తండ్రి మస్తాన్, బేడ బుడగ జంగాల, గ్రామం తొర్రూర్ వీటితోపాటు
మరి కొంతమంది పరారీలో ఉన్నారని వీరి మీద కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై ఉపేందర్.తెలిపారు.