logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

షార్ట్ న్యూస్.

హైదరాబాద్:ఈరోజు షార్ట్ న్యూస్.
> హైదరాబాద్: ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ.. ఇవాళ కడియం శ్రీహరి పిటిషన్ ను విచారించనున్న స్పీకర్.. ఇవాళ బీఆర్ఎస్ అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్న కడియం అడ్వకేట్లు..

> కోకాపేట్ నియోపోలిస్ లో విశాఖ శారద పీఠానికి హరీష్ రావు.. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులు.. పీఠం నిర్వాహకులను భయపెడుతున్నారు.. పీఠాలు, ఆలయాలు కూల్చడమేనా పాలనా.. కూల్చివేతలపై కనీసం పీఠం నిర్వాహకులకు సమాచారం ఇవ్వలేదు: హరీష్ రావు

> హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణం.. నేటి నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో పిల్లర్ పనులు ప్రారంభం.. ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య రద్దీ ఉండే ఛాన్స్.. సాగర్ సొసైటీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..

> వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య.. ధారూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దివ్య.. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ దివ్య..

> మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై 3,160 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,64,730.. 10 గ్రాములపై రూ. 2,900 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,000.. కిలోపై రూ. 5 వేలు పెరిగి రూ. 3 లక్షలకు చేరిన వెండి ధర..

> నిజామాబాద్: కోటగిరిలో దారుణం.. కన్నతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు.. మద్యానికి బానిసై తల్లి భూమవ్వను నిప్పు పెట్టి కాల్చి చంపిన కొడుకు.. పాత బట్టలు వేసి నిప్పు పెట్టిన కసాయి కొడుకు..

> HPV వ్యాక్సినేషన్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. రాజస్థాన్ లో HPV వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన నరేంద్ర మోడీ.. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు వ్యాక్సిన్.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్.. నేటి నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు HPV వ్యాక్సినేషన్..

> ఈసారైనా రాజ్యసభ అవకాశం నాకే ఇవ్వాలి.. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేస్తున్నా.. ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ నేనుంటా.. గత పదేళ్లుగా పార్టీలో నాకు అన్యాయం జరిగింది.. ఎలాంటి పదవి లేదు.. అయినా నిరంతరంగా పని చేస్తున్నా: వీహెచ్. హను
> ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ పై క్షిపణి దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ లోని టెహ్రాన్ లో భారీ పేలుళ్లు.. టెహ్రాన్ లో స్కూల్లు, కార్యాలయాలు మూసివేత..

> ఇరాన్ పై క్షిపణి దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన ఇజ్రాయెల్.. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై దాడులు చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్.. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులని ప్రకటన.. ఎయిర్ స్పేస్ ని మూసివేసిన ఇజ్రాయెల్..

> ఇరాన్ పై క్షిపణులతో విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్.. షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో ఆపరేషన్.. 30 ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులు.. నార్త్, ఈస్ట్ టెహ్రాన్ పై బాంబుల వర్షం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలింపు..

> చర్చలపై సంతృప్తిగా లేనని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే దాడులు.. నా మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదంటున్న ట్రంప్..

> ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడులు.. మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్స్.. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్.. వేలాది మంది సైనికులు మరణించారంటున్న ఇరాన్.. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు.. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు.. ఇస్ఫహాన్ లో భారీ పేలుళ్లు.. ఇస్ఫహాన్ లోనే న్యూక్లియర్ తయారీ కేంద్రాలు.. ప్రతిదాడులకు సిద్ధమవుతున్న .
> ఇరాన్ మీద దాడులపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించాడు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుంది.. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు: ట్రంప్.

> ఇరాన్ సుప్రీం లీడర్అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కార్యాలయం సమీపంలో క్షిపణి దాడి.. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో దాడులు.. దాడులకు ముందే బంకర్ లోకి వెళ్ల.
> ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతిదాడులు.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడి.. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ పై విరుచుకుపడిన ఇరాన్.. 35కి పైగా మిస్సైళ్లను ప్రయోగించిన ఇరాన
> అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ఇరాన్.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగింపు పలుకుతాం.. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో.

> కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు.. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న 20 మంది కార్మికులు, ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

0
0 views

Comment