logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు స్వర్గస్తులైనారు.

హైదరాబాద్:చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సి.ఎస్. సౌందరరాజన్ గారి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, 'చిలుకూరు సౌందరరాజన్' గా సుపరిచితులైన ఆయన మరణవార్త తనను ఎంతో కలిచివేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.

చిలుకూరు క్షేత్ర అభివృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ గారు పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు.

కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సామరస్యతకు ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

సౌందరరాజన్ గారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. నిరాడంబరతకు, సేవా గుణానికి ఆయన నిదర్శనం అన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరియు చిలుకూరు బాలాజీ భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నమో వెంకటే.

2
431 views

Comment