బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అరెస్ట్.
హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షులు వెళ్ళడం నేరమా అని ప్రశ్నిస్తున్నాను.
బీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేస్తుంది. బీజేపీ నేతలను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య.
కార్యకర్తలకు అండగా.. ఎమ్మెల్యేకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు అని ప్రశ్నిస్తున్నాను.
పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో నిర్బంధపు పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజానీకం, కామారెడ్డి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు.