
*తొరూర్ పట్టణంలో అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు..*భారీ ర్యాలీతో విజయోత్సవ సంబరాలు
తొర్రూర్ ఫిబ్రవరి 18(AIMEMEDIA); తొర్రూర్ మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ గా తూణం శ్రవణ్, వైస్ చైర్మన్ గా సోమ రజిని రాజశేఖర్ లు ఎంపిక ద్వారా ఎన్నిక కావడంతో పట్టణంలో కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని అంటాయి . బుధవారం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీని పాల కేంద్రం నుండి హరివిరాల సెంటర్ వరకు చేపట్టారు.
ప్రజాపాలనే గెలిచిందిఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ,తొర్రూరు ప్రజాతంత్ర ఫిబ్రవరి 18 తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపక్షమే గెలిచిందని పాలకుర్తి ప్రజలు తెలివైన వారిని మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని నిరూపించారని సందర్భంగా వారు అన్నారు ర్యాలీ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ లు వీరిని గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగాతొరూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జరిగిన విజయోత్సవ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు..ఈ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ సీపీఐ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా “జై యశస్విని రెడ్డి”, “జై ఝాన్సి రెడ్డి” అంటూ మార్మోగిన నినాదాలు పట్టణమంతా రాజకీయ ఉత్సాహాన్ని రేకెత్తించాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి చూసుకుంటా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.నియోజకవర్గం మా కుటుంబం ప్రజలు సంతోషంగా ఉండలనేదే మా సంకల్పం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొరూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం గెలుపుగా మారిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.ఈ విజయం కార్యకర్తల అంకితభావం, నాయకత్వం, ప్రజా దైవ మద్దతు వల్లే సాధ్యమైందని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నాయకులకు సూచిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు..ర్యాలీ అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలను అభినందించి, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ విజయోత్సవ కార్యక్రమం తొరూర్ పట్టణంలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.