భా .రా.స అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
తొర్రూరు ఫిబ్రవరి 13 (AIMEMEDIA)మున్సిపాలిటీ కి జరిగిన ఎన్నికల్లో బా,రా.స అభ్యర్థులను తొమ్మిది మందిని గెలిపించినందుకు పట్టణ ప్రజలకు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలవడడంతో గెలిచిన భారసా అభ్యర్థులు పత్రాలు తీసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించడంతో పాటు ఓటింగ్ శాతం పెరగటం సంతోషంకరమ్మన్నారు. తొర్రూర్ పట్టణంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు ఆగిపోయిన పనులను పూర్తి చేయడం కోసం అవసరమైతే ప్రజల మద్దతుతో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన తొర్రూర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. వారి వెంట గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు పట్టణ అధ్యక్షులు రామయ్య శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి మంగళంపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.బస్సులో గెలిచిన అభ్యర్థులతో ఉండి ప్రజలకు అభివాదం తెలిపారు.