logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బిలీఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం – 400 మందికి సేవలు

ఖమ్మంకలెక్టరేట్, ఫిబ్రవరి 12 (AIMA మీడియా):
Belief Hospital మరియు Leaf Charitable Trust ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు హాజరై వైద్య సేవలను పొందారు.
శిబిరంలో జనరల్ మెడిసిన్, స్త్రీ & ప్రసూతి, పిల్లల వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ప్రత్యేకంగా సేవలందించారు. మహిళల్లో రక్తహీనత, థైరాయిడ్, షుగర్, రక్తపోటు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలకు ప్రత్యేక సలహాలు ఇచ్చి, పోషకాహారం గురించి మార్గదర్శకాలు అందించారు. చిన్నపిల్లలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆసుపత్రి చైర్మన్ మోడెంపూడి రమాజ్యోతి మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఈ శిబిరంలో డాక్టర్ భానుచంద్ర, డాక్టర్ సత్య ప్రసన్నతో పాటు నర్సింగ్ సిబ్బంది, వాలంటీర్లు చురుకుగా పాల్గొని సేవలందించారు. మొత్తం సుమారు 400 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగింది.
ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

43
2173 views

Comment