
జన గణన గెజిట్ లో కాలం 12లో ఓబీసీ కులాన్ని చేర్చాలి. కేంద్ర మంత్రి కి మేమురాండం!
హైదరాబాద్:జనగణన గెజిట్ కాలమ్ 12 లో ఓబీసీ కులాన్ని చేర్చాలి
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు అఖిల భారత
ఓబీసీ సంక్షేమ సంఘం వినతి
ప్రస్తుత సంవత్సరంలో సమగ్ర జనగణన ఫేజ్ - 1లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గృహాల నిర్ధారిత మరియు గృహ వసతి పరికరాల వినియోగం పై నిర్వహిస్తున్న జనగణన గెజిట్ కాలమ్ 12 లో ఎస్సీ ఎస్టీ లకు వలే ఓబీసీ పదాన్ని చేర్చేందుకు కృషీ చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిల్లీ లోని మంత్రి షేఖావత్ ను ఆయన నివాసంలో వరప్రసాద్ యాదవ్ నాయకత్వం లో ఓబీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారంసమగ్ర జనగణన లో ఓబీసీ కుల గణన తొలి విడత గృహ నిర్ధారిత సేకరణ కాలమ్ 12 లో ఓ బీసీ పదం పొందుపర్చక పోవటం వల్ల ఓబీసీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందనీ వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.అంతేగాక కేంద్ర మంత్రి మండలి నిర్ణయం పై తీవ్ర అపోహలు నెలకొంటున్నాయని వరప్రసాద్ యాదవ్ మంత్రి కి వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టి కి వెళ్లి ఓబీసీ లకు న్యాయం జరిగే లా చూడాలని వరప్రసాద్ యాదవ్ మంత్రి నీ కోరగా మంత్రి షేకావతు సానుకూలo గా స్పందించారు.అలాగే బొందిలి కులాన్ని ఓబీసీ జాబితా లో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వరప్రసాద్ యాదవ్, ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్ సింగ్ విజ్ఞప్తి చేశారు .
ఓబీసీప్రత్యేక మంత్రిత్వ శాఖ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టి కి తీసుకు వెళ్తాo" : ------------------------------------------కేంద్ర మంత్రులు మాన్య శ్రీ రామ్మోహన్ నాయుడు, మాన్య శ్రీ రామ్ థాస్ అథావాలే......
జన గణన లో ఓబీసీ పదాన్ని చేర్చేందుకు, కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని, బొందిలి కులాన్ని ఓబీసీ జాబితా లో చేర్చేందుకు కృషీ చేయాలని కేంద్ర మంత్రులు మాన్య శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు, మాన్య శ్రీ రాoదాస్ అథావాలేకు పార్లమెంట్ లోని వారి ఛాంబర్ లలో కలిసి వరప్రసాద్ యాదవ్ గారి నాయకత్వంలో OBC ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. ఈ అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి కి తీసుకు వెళ్తామని, ఓ బీసీ లకు న్యాయం జరిగెలా చూస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ యాదవ్ వెల్లడించారు, ఓబీసీ ప్రతినిధి బృందం లొ తెలుగు రాష్ట్రాల నేతలు ప్రదీప్ కుమార్, డి నాగేశ్వర్, అర్జున రావు, శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్, జి అనుపమ, మల్లేశ్వర రావు గౌడ్ వున్నారు