logo

నెల్లిమర్ల నగర పంచాయతీ మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు

పదవీ బాధ్యతలు చేపట్టిన మేనేజర్ శ్రీనివాస
రావు పంచాయతీ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసారు

నెల్లిమర్ల నగర పంచాయతీ మేనేజర్ గా ఉప్పాల శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన మండపేట మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నెల్లిమర్ల నగర పంచాయతీ మేనేజర్ గా ప్రమోషన్ పై వచ్చారు. ఇప్పటివరకు మేనేజర్ గా విధులు నిర్వహించిన టీ. జయరామ్ అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ రెవెన్యూ అధికారిగా ప్రమోషన్ పై వెళ్లినందున ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి శ్రీనివాస రావు కు బాధ్యతలు అప్పగించారు. నూతన మేనేజర్ శ్రీనివాసరావు నగర పంచాయతీ చైర్
పర్సన్ బంగారు సరోజిని, వైస్ చైర్మన్ సముద్రపు రామారావు లను పూల బొకేతో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్త మేనేజర్ శ్రీనివాసరావు కు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు ప్రధానమైన త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు పై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, నగర పంచాయతీలో ఉన్న ఎనిమిది సచివాలయా లలో పనిచేస్తున్న సెక్రటరీలను సమన్వయపర్చు కొని, ఎవరు విధులను వారు సక్రమంగా, బాధ్యతాయుతంగా, నిర్వహించేటట్లుగా పర్యవేక్షించాలని, నెలిమర్ల, జరజాపుపేట ప్రజల యొక్క సమస్యల పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, రాబోయే వేసవి ని దృష్టిలో పెట్టుకొని తగు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, నగర పంచాయతీ కార్యాలయం నకు సమస్య పై వచ్చిన ప్రతి ఒక్కరి పని వెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ దుస్సాలువా, పూల బొకేతో గౌరవించారు. ఆర్.ఐ రాజ్యలక్ష్మి, నగర పంచాయతీ సిబ్బంది మరియు
సచివాలయం సిబ్బంది హాజరయ్యారు.

6
693 views