logo

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి 33వ సంవత్సర వారోత్సవాలు.

హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్ జోన్ వార్తలు

కొలిచిన వారికి కొంగు బంగారం

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

గురువారం 22 జనవరి 2026 :

రేపటి నుంచి 33వ వార్షికోత్సవం



ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కు వగా అమ్మవారిని దర్శించు ఆలయం కుంటున్నారు. దినాదినాభివృద్ధి చెందుతోంది. మాజీ సీఎల్పీ నేత దివంగత కృషితో పి.జనార్దన్రెడ్డి చిన్నగా ఉన్న ఆలయం ఇప్పుడు అతి పెద్ద అల యంగా అవతరించింది. ఇప్పుడు 33వ వార్షికోత్సవ వేడుకల కోసం ముస్తాబవు తోంది.

ఆలయ చరిత్ర

పౌరాణిక చరిత్ర ఆధారంగా. ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు వచ్చిన శక్తి స్వరూపిణి పెద్దమ్మతల్లి జూబ్లీ హిల్(గతంలో కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం)లోని బావి వద్ద సేద తీర్చుకోవడానికి వచ్చి అక్కడే కొలవు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అప్పుడే ఆమె చిన్న. విగ్రహం ఇక్కడ కొలువుదీరినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ విగ్రహం ఉండడం గమనించిన కొందరు గిరిజ మలు చిన్నగా గుడిసె వేసి పూజలు చేయడం ప్రారం లించారు. అనంతరం అది చిన్న ఆలయంగా మారింది. ఆలయం చుట్టుపక్కల కొండలు, గుట్రలతోపాటు చెట్లు

బంజారాహిల్స్, జనవరి 21 (AIMA): ముగ్గురమ్మల మూలపుటమ్మ.. కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్ ఫ్రీ. పెద్దమ్మ తల్లి. మొక్కు వెంటనే తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నిత్యం వేల సంఖ్యలో ఆల యానికి వస్తుంటారు మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడు తోంది. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతాన

విపరీతంగా ఉండి ఇది చిట్టడివిగా కనిపించడంతో చాలామంది అటు వైపు వెళ్లేందుకు భయపడే వారు. ఆదివారం, మంగళవారం కొందరు ఉదయమే వచ్చి ఇక్కడ వనభోజనాలు వండుకొని తినేవారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వారు. తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వ ర్యంలో బిజ్జుమళ్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారు. పీజే ఆర్ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనవాయితీగా పెట్టుకునే వారు. జూబ్లీ హిల్స్తో పాటు మాదాపూర్ ధనవంతుల కాలనీగా మారడంతో జనసంచారం కూడా పెరిగింది క్రమంగా అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించారు. ఆల యంలో కట్టడాలు చూపరులను కనువిందు చేస్తు న్నాయి. ప్రారంభంలో ఆర్చీ మొదలుకొని అనిచోటా దేవతామూర్తులు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తారు. ఆలయ ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతోంది. ప్రధాన ఆలయం ముందు మధురై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన దీపాంత భక్తులను ఆకర్షిస్తోంది.

వార్షికోత్సవం పూజలు ఇలా..

ఈనెల 23న ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లి అభిషేకం, మంత్రపుష్పము, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అఖండదీపారాధన, వేద పారా యణము, నవగ్రహజపములు, రుద్రాభిషేకం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ నిర్వ హిస్తారు. ఈనెల 24న మండపపూజలు, వేదపారాయణము, అరుణ, పంచోపనిషత్, దేవీభాగవత, మహావిద్వా, చండీపారాయణాదులు, సామూహిక లలితాసహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయి.



శ్రీ పెద్దమ్మ తల్లి.

రథసప్తమి రోజు రధోత్సవం

పెద్దమ్మ తల్లి ఆలయంలో నిత్య పూజలతోపాటు విశేష పూజలు నిత్యం జరుగుతుంటాయి. మాఘమా సంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడు కలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పెద్దమ్మ తల్లి విగ్రహం రదోసప్తమి రోజున ప్రతిష్టాపన జరిగింది. ఈ తరు ణంగా ప్రతి యేటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి పలు వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఈనెల 25న రథో త్సవం జరపనున్నారు. ఈనెల 26న పెద్దమ్మవారి ఉత్సవ మూర్తికి పుష్కరిణీ యందు అనభృత స్నానంతో వార్షికో త్సవాలు ముగుస్తాయి.

0
24 views