logo

వైభవంగా హరి–హర క్షేత్రంలో అభిషేక మహోత్సవం అయ్యప్ప ఆలయం కు రూ 65 వేలు ఆర్థిక సాయం చేస్తున్న బాపురెడ్డి దంపతులు

తొర్రూరు జనవరి 22 () భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారమై భక్తుల ను పులకరింప జేస్తూ, శివ–కేశవ తత్త్వ సమన్వ యానికి ప్రతీకగా నిలిచిన తొర్రూర్ డివిజన్ కేంద్రం నుండి జిల్లా కేంద్రముకు వెళ్లే రహదారి ప్రక్కన ఉన్న హరి–హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలోహరిహర సుతుడు అయ్యప్ప స్వామికి మరియు ఆలయంలో ఉన్న మూల విరాట్టులకు అభిషేక మహోత్సవంను ఆలయ ప్రధాన అర్చకులు
శివ శ్రీనివాస్ అర్చక స్వాములు ఇంత కన్నుల పండుగగా నిర్వహించారు . ఈ సందర్భం గా ఆలయ ట్రస్ట్ చైర్మన్ దారం ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి ప్రతి భక్తుడి ధర్మకర్త వ్యమని స్పష్టం చేస్తూ,
ట్రస్ట్ మెంబర్లు, మెట్ల దాతలు, విగ్రహ దాతలు బకాయిలను వెంటనే చెల్లించి పవిత్ర దేవాలయ అభివృద్ధికి చేయూత నివ్వాలనిభక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ మహోత్సవముకు
చాపలబాపు రెడ్డి అనిత దంపతులు రూ. 65,116/లు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో చాపల బాపు రెడ్డి దంపతులు, ముద్దసాని సురేష్, తునం శ్రవణ్,దుబ్బాక వెంకటరెడ్డి, మహబూబ్ రెడ్డి, బిజ్జాల అశోక్, బిజ్జాల వెంకటరమణ, కాంతాల సోమిరెడ్డి *రేగురు శ్రీనివాస్, బట్టి కమల్, మహేష్, పెదగాని చిన్న సోమయ్య,
పోతరాజు యాకేందర్, నిమ్మల శేఖర్ రావుల వెంకటరెడ్డి లు పాల్గొనగా చాపల బాపు రెడ్డి మాట్లాడుతూ ఝాన్సీ యశస్విని రెడ్డి సహకారంతో నవగ్రహ మంటపం, ప్రహరీ గోడ నిర్మాణం, హోమశాల అభివృద్ధి వంటి మహత్తర ఆలయ అభివృద్ధి పనులకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని భక్తుల సమక్షంలో ప్రకటించారు భక్తి, సేవ త్యాగం భావాలతో హరి–హర క్షేత్రం మరింత మహిమాన్వితంగా
విరాజిల్లాలని కోరుకున్నారు

5
60 views