logo

ఉత్సాహంగా,సందడిగా సంక్రాంతి సంబరాలు ఊరేగిన గంగిరెద్దు, సందడిగా మటన్ చికెన్ షాపులు

తొర్రూర్ జనవరి 16 (AIMEDIA )ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే పండుగ, రైతుల ఇంట కొత్త పంటలు చేరే సమయం, తమ తమ పిల్లలు సెలవులకు పండగ ఉత్సాహం కోసం చేరే పిల్లలతో ప్రతి ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది. బుధవారం భోగి పండుగ గురువారం మకర సంక్రాంతి శుక్రవారం సందర్భంగా ప్రతి ఇల్లు రంగవల్లులతో వాడ వాడలా ఎంతో శోభయమానంగా వెలసిల్లాయి. భోగి సంక్రాంతి రోజున ప్రతి ఇంటి ముందు యువతులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ రంగుల నింపుతూ ఎంతో కలర్ ఫుల్ గా ముగ్గులు వేశారు. పట్టణానికి చెందిన గోశాల అధ్యక్షులు విశ్వహిందూ పరిషత్ జిల్లా పర్యావరణ ప్రముక్ దారం కుమారస్వామి పండగల పరమార్ధాన్ని తెలియజేస్తూ యువతులలో ఉత్సాహం నింపేందుకు మకర సంక్రాంతి రోజున పట్టణ వీధులలో కలియ తిరుగుతూ ఉత్తమంగా ఉన్న రంగవల్లులను ఎన్నుకొని తానే స్వయంగా దేశ నాయకులు చిత్రపటాలు ఉన్న పోస్టర్లను ఆయా విజేతలకు అందజేశారు. అదేవిధంగా పట్టణంలో చికెన్ షాపులు మటన్ షాపులు కలర్స్ అమ్మే దుకాణాలు సంక్రాంతి నోముల షాపులు కిరాణా షాపులు జనసంద్రంతో ఎంతో సందడిగా కనిపించింది. గురువారం మకర సంక్రాంతి రోజున వీధులలో గంగిరెద్దుల వారు గంగిరెద్దులు తిప్పుతూ ఆశీర్వాదం ఇస్తూ గృహస్తులు తమకు తోచినంత సహాయాన్ని అందజేయడంతో వారు కూడా ఎంతో సంతోషం చెందారు. పండుగ కోలాహలంతో మూడు రోజులుగా ప్రతి ఇల్లు సంతోషాలతో ఆనందమయం చెందారు. మండలంలోని హరిపురాల గ్రామంలో అమ్మపురంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పట్టణంలోని వేణుగోపాలస్వామి వెంకటేష్ స్వామి ఆలయాలలో గోదా కళ్యాణం

0
0 views