logo

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు*

తొర్రూరు జనవరి 16(AIMEMEDIA ) లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ సూర్నం రామ నరసయ్య అధ్యక్షతన సంక్రాంతి సంబరాలలో భాగంగా వందేమాతరం ఫౌండేషన్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి సిహెచ్ రేవంత్ కుమార్, రెండవ బహుమతి ఎం. రిషిక, మూడవ బహుమతి జె.శ్రీజ, ప్రోత్సాహక బహుమతి కె.అన్విత్, రిత్విక్ లకు అందజేశారు. ఫౌండేషన్ లోని విద్యార్థిని విద్యార్థులకు ఆల్పాహారాన్ని అందజేశారు.పదవ తరగతి చదువుతున్న 17 మంది విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు,20 మంది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులు, 30 మందికి వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కూల్ గ్యాట్ డాక్టర్ కిరణ్ కుమార్, ఆర్ సి దామెర సరేష్, జెడ్ సి చిదిరాల నవీన్,క్లబ్ సెక్రెటరీ ముడుపు రవీందర్ రెడ్డి,క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, పి జెడ్ సి ప్రతాపని వెంకటేశ్వర్లు, వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు రవీందర్, క్లబ్ జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

4
134 views