బ్రేకింగ్ న్యూస్....
హైదరాబాద్: > హైదరాబాద్: కుత్బుల్లాపూర్లో మెడికల్ షాప్స్పై డ్రగ్ కంట్రోల్ దాడులు.. దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో బ్రాండెడ్ పేర్లతో నకిలీ మందుల దందా.. నకిలీ ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన డీసీఏ అధికారులు.. బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లతో నకిలీ మందులు అమ్ముతున్నట్లు గుర్తింపు.. దుర్గా మెడికల్ షాపు యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు..> హైదరాబాద్ లో పీకలు కోస్తున్న చైనా మాంజా.. చైనా మాంజా తగిలి ఏఎస్ఐ గొంతుకు తీవ్ర గాయం.. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. ఎగ్జిబిషన్ లో డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఘటన.. గొంతుకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలింపు.. > హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టెల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా.. రోడ్డుకు అడ్డంగా పడ్డ లారీ.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన కట్టెలు.. సుమారు 6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ఇమామ్ గూడ నుంచి ఓఆర్ఆర్ వరకు ట్రాఫిక్ జామ్.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు.. ఢిల్లీ: దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట.. 10 నిమిషాల ఆన్ లైన్ డెలివరీ నిర్ణయం ఎత్తివేత.. ఆదేశాలు జారీ చేసిన కేంద్రమంత్రి మాండవీయ..