logo

హైందవ సంప్రదాయానికి ప్రతిబింబాలు రంగవల్లులు*

తొర్రూరు జనవరి 9(AIMEMEDIA )సంస్కృతికి ప్రతిబింబాలు సత్తా వర్ణాల రంగవల్లులు అని ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ధరావత్ విమల అన్నారు.
ధర్మ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కస్తూర్బా పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు, వర్తమాన అంశాలను మేళవించి చక్కని చుక్కల ముగ్గులను విద్యార్థులు ఆవిష్కరించారు.డాక్టర్ మౌనిక, చిరంజీవి దంపతుల సహకారంతో విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాలకు ఉపయోగపడే విధంగా నోటీస్ బోర్డు, చార్ట్స్ అందించారు.
అనంతరం స్కావెంజర్లకు బ్లౌజులు వితరణ చేశారు.ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ రంగురంగుల ముగ్గులు వేయడం వలన విద్యార్థుల్లో దాగివున్న అంతర్గత నైపుణ్యాలు వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహద పడతాయన్నారు.
సంక్రాంతి పండుగ కు పతంగులు, ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు అందాన్ని తెస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి బి. శైలజ, ఉపాధ్యాయులు నాగలక్ష్మి, ఆర్ సబిత, మాధవి, విజయ, ప్రియాంక, మణెమ్మ, శ్రీలత, మంజుల, రజిత తదితరులు పాల్గొన్నారు.

0
89 views