logo

జరజాపుపేట బీసీ కాలనీలో సీ సీ డ్రైనేజ్ పనులు ప్రారంభం


విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట
గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు అన్నారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో గల బీసీ కాలనీ నందు, 15వ ఆర్థిక సంఘం నిధులు 1 లక్ష రూపాయలుతో, సుమారు 47 మీటర్లు పొడవునా,1 అడుగు లోతునా,9×6 గల వాల్ సైజ్,1 అడుగు వెడల్పు గల సీసీ డ్రైన్ చేపడుతున్న పనులను ఆయన పరిశీలించి, తగు సూచనలు చేసి, నాణ్యత ప్రమాణాలను పాటించి, క్వాలిటీగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను, కౌన్సిలర్ ను, పర్యవేక్షిస్తున్న ఏ.ఈ.లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరజాపుపేటలో గల 6 వార్డులలో అభివృద్ధి పనులు, ఆయా వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు, త్వరలోనే, మిగతా వార్డులలో, అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డుకు, కౌన్సిలర్ ఆమోదం మేరకు, కౌన్సిల్ తీర్మానం మేరకు, నిధులను కేటాయించడం జరిగిందన్నారు. అలాగే 2023 - 2024 కు మంజూరైనా 79 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 39 అభివృద్ధి పనులు లో ఇప్పటికే చేపట్టడం,4 వర్క్లుపూర్తి చెయ్యడం జరిగిందని, ఈ నెల 10 వతేదీ నాటికి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి, మిగిలిన వీ.ఎం.ఆర్.డీ.ఏ నిధులు నుండి చేపట్టే అభివృద్ధి పనులకు, గతంలో టెండర్స్ వేసినవారు పనులు చేపెట్టకపోవడం వలన, ఆ యొక్క పనులను రద్దు పరచి, మరలా ఆ యా వార్డులలోనే ఆ యా వర్కులు కు,రీటెండర్ పిలవడం జరుగుతుందని తెలియజేశారు. పనులు అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ వార్డు కౌన్సిలర్స్, కౌన్సిలర్ ప్రతినిధులు తుమ్ము నారాయణమూర్తి, నల్లి శ్రీను, కాంట్రాక్టర్ మోయిద చిరంజీవి, రాష్ట్ర నాగవంశం మాజీ డైరెక్టర్ మద్దిల వాసు, కాలనీ పెద్దలు శ్రీమతి కనకల హైమావతి, మద్దిల పైడిరాజు, కనకల పైడిరాజు అభివృద్ధి కమిటీప్రతినిధులు,పాల్గొన్నారు.

8
1469 views