logo

ముక్కోటి ఏకాదశి రోజున పాల్గొన్న సముద్రపు రామారావు

ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన రామతీర్థం పుణ్యక్షేత్రంలో జరిగిన ఉత్తర ద్వార దర్శనం మరియు మహాగిరి ప్రదిక్షణ, సుదర్శన హోమం, సీతారామ స్వామి వారి కళ్యాణ్యమహోత్సవం కార్యక్రమాలకు నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్ శ్రీ సముద్రపు రామారావు హాజరై ప్రత్యక్షంగా అన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, సర్వమానవాళికి నిజమైన వ్యక్తిత్వాన్ని చాటిచెప్పి, తన పాలనా దక్షతతో నేటి ఆధునిక కాలానికి ఆదర్శ పురుషుడైన కళ్యాణ రాముడు శ్రీరామచంద్రుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా జరిగిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం వారు మరియు విశాఖపట్నం జిల్లా యంత్రాంగం, శ్రీ వరాహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా, ఏ విధంగా అత్యధికంగా భక్తులు పాల్గొనే విధంగా తీసుకున్న చర్యలు, చేపట్టే సకల సదుపాయాలు, అంగరంగ వైభవంగా సింహాచల శ్రీ వరాహస్వామి వారి గిరిప్రదక్షిణ జరిపించే విధానంను, ఎంతో ప్రసిద్ధి చెందిన మన రామతీర్థం పుణ్యక్షేత్రం నందు జరిగే గిరిప్రదక్షిణకు బారి ఏర్పాట్లు వచ్చే సంవత్సరం అయిన గౌరవ జిల్లా అధికార ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారయంత్రాంగం, దేవాదాయ శాఖ వారు సమన్వయంతో ఈ ప్రాంత ప్రజలకు కోసం, శ్రీరాముని భక్తుల కోసం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించలని కోరారు. దేవస్థానం సిబ్బంది మరియు అర్చకులు, పోలీస్ యంత్రాంగం స్వచ్ఛంద సేవకులు హాజరైన భక్తులకు మంచి సేవలు అందించారు అని తెలియజేశారు.

4
605 views