జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అసెంబ్లీలో స్పీచ్.
హైదరాబాద్:జూబ్లీహిల్స్: నవీన్ యాదవ్ తొలి ప్రసంగం.. సమస్యలపై గళం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శాసనసభలో తొలిసారి గళం విప్పారు. కృష్ణానగర్ లో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న హైటెన్షన్ వైర్లను తొలగించి, వెంటనే అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు.