logo

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం.

హైదరాబాద్:ఆళ్లగడ్డ, న్యూస్ టుడే: జాతీయ రహదారి (40) పై శుక్రవారం తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు మధ్యన జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెలర్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్లోంది. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు.

0
109 views