*సిద్ధార్థ హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు*
తొర్రూరు డిసెంబర్ 24(AIMEMEDIA) స్థానిక సిద్ధార్థ హై స్కూల్లో బుధవారం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శాంతాక్లాజ్ వేష ధారణ లో పిల్లలు ఆకట్టుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
కరస్పాండెంట్ ముత్తినేని జయ ప్రకాష్ మాట్లాడుతూ....
యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని వివరించారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా ఏసుక్రీస్తు నిరూపించారని చెప్పారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ఏసుప్రభువును ప్రార్థిద్దామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.