logo

రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వీడ్కోలు.

హైదరాబాద్: గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది ముగించుకొని హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన సందర్భంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి రాష్ట్రపతి గారికి వీడ్కోలు పలికారు.

కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతి గారికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

0
35 views