logo

ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న నిందితుల అరెస్టు

తొర్రూరు డిసెంబర్ 12(AIMEMEDIA)
ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న నిందితుల అరెస్టు చేస్తున్నారని తెలుసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తొర్రూరు ఎస్సై జి ఉపేందర్ తెలిపారు. వివరాలు తెలుపుతూ ఈనెల గురువారం 11.సాయంత్రం 4.30 గంటలకి ధరావత్ ఆనంద్, ములుగు నివాసి, పోచంపల్లి గ్రామం, పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాలకేంద్రం దగ్గర ఆగి అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని, కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని, లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారు. ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ను విడిపించుకున్నారని ,ముగ్గురు వ్యక్తులలో ఒకతను సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా ఇద్దరూ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారని తెలిపారు . నిందితులు వాడిన కారును బట్టి వారిలో ఒక అతను జాటోత్ ఉపేందర్ సింగ్, తండ్రి భద్రు, కేశ్య తండా పెద్దమంగ్యా తండా గ్రామం(వెలికట్టే) తొర్రూరు మండలం, ఇతను సిగ్నేచర్ డిజిటల్ స్టూడియో యాంకర్ గా పనిచేస్తున్నాడని, జర్నలిస్టును అని చెప్పుకొని తిరుగుతాడని,. అతన్ని గుర్తించి, నిన్న రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకుని అరెస్టు చేశామని చెప్పారు . అతని వద్దనుండి నేరానికి వాడిన కారును బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు 50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోనైనది ఇతని నేరం ఒప్పుకోలు మేరకు మిగతా ఇద్దరి నేరస్తుల్లో ఒకరు ఒక ప్రముఖ వార్త పత్రికలో తొర్రూర్ విలేకరిగా మరోతను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తొర్రూర్ రిపోర్టర్గా గుర్తించినైనది త్వరలోనే వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని ఎస్సై జి ఉపేందర్ తెలిపారు .

0
0 views