
భగవద్గీత పై అవగాహన కలిగించేందుకు పోటీలు
విజేతల కు ప్రశంస పత్రాలు బహుమతి అందజేత
తొర్రూరు నవంబర్ 30 (AIMEMEDIA) భగవద్గీత సారాంశాన్ని పిల్లల్లో మరియు యువతలో నాటే ఈ కార్యక్రమం, జిల్లాలో ధార్మికత, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించిందని వందేమాతరం రవీంద్ర మాట్లాడుతూ తెలిపారు
గీతా జయంతి పురస్కరించు కొని ఆదివారం పట్టణంలోని వందేమాతరం ఫౌండేషన్ నితిన్ భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారపరిషత్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు. గణంగా ముగిశాయి. ఈ పోటిలో వందేమాతరం ఫౌండేషన్ లోని కలాం-100 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారని టీటీడి కార్యనిర్వహకులు
రామిరెడ్డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ
ఈ పోటీల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగయోగము, 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగయోగము నుండి శ్లోకాలను కంఠస్థం చేసి ప్రవచించారని ,జూనియర్ విభాగంలో
పి.సాయి ప్రసన్, బి ప్రియాంక, బి.రిశ్విక వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందగా , సీనియర్ విభాగంలో బి. మణికృత్, డి.శివ, సిహెచ్. రేవంత్ కుమార్
వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ వరుసగా బహుమతులు
పొంది.అందరినీ ఆకట్టుకుని విజేతలుగా
బహుమతులు పొందారని తెలిపారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వందేమాతరం వ్యవస్థాపకులు. వందేమాతరం రవీంద్ర టీటీడీ ప్రోగ్రామ్ ఇన్చార్జి రామిరెడ్డి కృష్ణమూర్తి,
విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ పోటీలకు జి.అరుంధతి ఎం. ప్రవీణ్ కుమార్, ఆర్.రామకృష్ణ మొదలగువారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణెయతగా వ్యవహరించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వందేమాతరం ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు