
కళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి
లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి
నేత్రపరీక్ష శిబిరంలో పాల్గొన్న లయన్స్ బాధ్యులు
తొర్రూర్ నవంబర్ 13 (AIMEMEDIA) ప్రజలు తమ కళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లైన్స్ క్లబ్ భవనంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రామ్ నర్సయ్య అధ్యక్షతన ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరము నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కొంత నిర్ణీత వయసు దాటిన తర్వాత తమ నేత్రాల పట్ల శ్రద్ధ వహించాలని పెరుగుతున్న వయసు రీత్య చూపు మందగిస్తుందని, కళ్లకు వచ్చే జబ్బులు ముందుగానే గుర్తించి చికిత్స పొందడం వల్ల తాము జీవించినంత కాలం లోకాన్ని చూస్తారని అశ్రద్ధ వహిస్తే కళ్ళు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని ముఖ్యంగా బీ.పీ, షుగర్ ఉన్నవారు ఎప్పటికప్పుడు నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .తొర్రూర్ లయన్స్ క్లబ్ వారు విభిన్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందడం ఎంతో అభినందనీయమన్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రామ నర్సయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు విద్యార్థులకు ,ప్రజలకు అవసరార్థులకు సుమారు 500 కు పైగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్వహించామని, ప్రపంచ దయ దినోత్సవం సందర్భంగా ఈ నేత్ర పరీక్ష శిబిరాన్ని లయన్స్ చారిటీ హాస్పిటల్ నిర్వాకులు వేణుగోపాల్ సహకారంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిబిరంలో 150 మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించగా ఇందులో సుమారు 55 మందికి ఆపరేషన్లు చేయాల్సింది అవసరం ఉందని గుర్తించామని వీరిని హనుమకొండ కు తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లను చేయించడం జరుగుతుందని అన్నారు. క్లబ్ సభ్యులు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. మరో పి డి.జి తమ్మెర నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటివరకు నూతన ఒరవడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో క్లబ్ ముందు ఉండడం ఎంత ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో.ఆర్ సి దామర సురేష్, జోన్ చైర్మన్ చిదిరాల నవీన్ కుమార్, లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు బాధ్యులు, తమ్మెర విశ్వేశ్వరరావు, డాక్టర్ కే యాదగిరి రెడ్డి,డాక్టర్ పి కిరణ్ కుమార్ , తుమ్మేటి వెంకటరెడ్డి, తమ్మెర వీరభద్రరావు, టి వెంకటేశ్వర్లు, గోపాల్, గోవిందరాజు , కోనే ప్రభాకర్, ఆర్ వెంకన్న, ,కటరమణ రెడ్డి, లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ముడుపు రవీందర్ రెడ్డి, కోశాధికారి వజినపెళ్లి శ్రీనివాస్, ఎం డీ జలీల్ తదితరులు పాల్గొన్నారు.