logo

ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ముద్దు


◻️ నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు, బడ్డుకొండ అప్పలనాయుడు అధ్యక్షతన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
తెలుపుతూ కోటి సంతకాల సేకరణ మరియు నెల్లిమర్ల నియోజకవర్గం పరంగా ప్రజా ఉద్యమంలో భాగంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.

◻️ జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్య మంత్రివర్యులు, ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణలో భాగంగా నెల్లిమర్ల నియోజవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో గల ప్రజలందరి చేత సంతకాలు సేకరణ చేసి ఈరోజు మొట్టమొదటిగా నగర పంచాయతీ తరపున నాలుగు వేల సంతకాలు చేసిన పత్రాలను నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు మరియు జిల్లా అధికార ప్రతినిధి వైస్ చైర్మన్ సముద్రపు రామారావు నేతృత్వంలో నియోజవర్గం పార్టీ ఇన్చార్జి బడ్డుకొండ అప్పలనాయుడు కి అందజేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీలు నుండి కూడా అందజేయడం జరిగింది. ఈ లేఖలన్నీ రాష్ట్ర గవర్నర్ వారికి అందజేయాలనీ వైస్సార్సీపీ నిర్ణయించడం జరిగినది.

◻️పేద విద్యార్థులు ఆశయాలుకు అడ్డు తగలడం సరికాదు అని, విద్య వైద్యం ప్రజల హక్కుని, ఇవి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించాలని ప్రైవేటీకరణ చేయకూడదని మాజీ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు పేర్కొన్నారు..

◻️ నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా తరలివెల్లి తహసీల్దార్ కి కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.

◻️ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు.

◻️కార్యక్రమంలో పాల్గొన్న నెల్లిమర్ల ఎమ్ పి పి శ్రీమతి అంబళ్ల సుధారాణి నాలుగు మండలాల మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, గదల సన్యాసి నాయుడు, చిక్కాల సాంబ, జిల్లా అధికార ప్రతినిధి మరియు వైస్ చైర్మన్ సముద్రపు రామారావు, జిల్లా బి సి అధ్యక్షులు మహంతి జనార్దన్, మహంతి శ్రీను, పిన్నింటి తమ్మినాయుడు, వైస్ ఎమ్ పి పి లు పతివాడ సత్యనారాయణ, సారిక వైకుంఠం, చంటి రాజు, వైస్ ఛైర్మెన్ కారుకొండ కృష్ణ, నియోజకవర్గం యువజన అధ్యక్షులు
ప్రదీప్ నాయుడు, సీనియిర్ నాయకులు మత్స సత్యనారాయణ, గిరిబాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి సుందర హరీష్, ఎస్ సి సెల్ అధికార ప్రతినిధి రేగానా శ్రీనివాసరావు, అంగన్వాడీ అధ్యక్షులు శ్రీమతి పతివాడ కృష్ణ వేణి, సర్పంచ్ లు, ఎమ్ పి టీ సి లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు & పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

16
1839 views